వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అని వ్యాఖ్యానించారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన గత రెండు రోజులుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో గత ఏడాది వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో ఆ రాష్ట్రం సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీటిని ప్రస్తావిస్తూ.. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్” అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. “చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ పదేళ్లలో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా తయారుచేశారు“ అని కిరణ్ నిప్పులు చెరిగారు.
మిథున్‌రెడ్డి కౌంటర్
మాజీ సీఎం కిరణ్‌కు సిట్టింగ్ ఎంపీ, వైసీపీనేత మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకాయన పదేళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సూట్ కేసుతో వచ్చారు జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో హైదరాబాద్ తిరిగి వెళ్లేలా ప్రజలు తీర్పు ఇస్తారు
అని సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్‌కి సానుభూతితో ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు.
This post was last modified on April 1, 2024 6:51 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…