త్రిశంకు స్వ‌ర్గంలో రాధా.. రాజ‌కీయాలు ష‌ట్‌డౌన్‌!

వంగ‌వీటి రాధా. ఈ పేరు చెబితే చాలు ఆయ‌న‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయ‌న ఇప్పుడు అస‌లు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. వాస్త‌వానికి అధికారికంగా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. కానీ, అలా ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవ‌డంలేదు. అస‌లు పార్టీలో రాధా పేరు త‌లుచుకునేవారు కూడా లేరు. అంతేకాదు.. అస‌లు రాధా గురించిన చ‌ర్చ‌కూడా జ‌ర‌గ‌డం లేదు.

దీనికి కార‌ణం.. ఆయ‌న టీడీపీ నేత‌ల‌తో కాకుండా.. వైసీపీ నాయ‌కుల‌తో రెండేళ్లుగా చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డ‌మే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకుటుంబాన్ని దూషించిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో ఆయ‌న త‌ర‌చుగా ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు. వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దీంతో చంద్ర‌బాబు పైకి చెప్ప‌క‌పోయినా.. ఆయ‌న‌ను పార్టీలో దూరం పెట్టారు. ఇక‌, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఆయ‌న టికెట్ అడిగింది లేదు.. పార్టీ ఇచ్చిందీ లేదు.

మ‌రోవైపు జ‌న‌సేన‌లో చేరుతున్నారంటూ.. వంగ‌వీటి రాధాపై ప్ర‌చారం జ‌రిగింది. అది కూడా సాకారం కాలేదు. రెండు రోజుల కింద‌ట మ‌చిలీప‌ట్నం ఎంపీ, కాపు నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరితో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లో రాధా పాల్గొన్నారు. దీంతో రాధాకు ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. వాస్త‌వానికి జ‌న‌సేన‌కు కేటాయించిన 21 స్థానాల్లో నిన్న‌టి వ‌ర‌కు 18 స్థానాలు ప్ర‌క‌టించారు. తాజాగా ఒక స్థానం ప్ర‌క‌టించారు.

మ‌రో రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అవ‌నిగ‌డ్డ కూడా ఉంది. అయితే.. అంద‌రూ చెబుతున్న‌ట్టుగా రాధా పేరు అయితే.. జ‌న‌సేన ఎక్క‌డా ప‌రిశీల‌న‌లో తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ సీటును టీడీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో రాధా ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే జ‌రిగితే..  రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ లేకుండా పోయిన‌ట్టు అవుతుంద‌నిప‌రిశీల‌కులు చెబుతున్నారు. రంగా వార‌సుడిగా ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని కాపు నాయ‌కులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

4 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

9 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

12 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

13 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

14 hours ago