ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కర్నూలు ఎంపీగా 2014-19 వరకు పనిచేశారు.
ఇక, ఇప్పుడు కూడా కర్నూలు ఎంపీ అడిగినా.. ఆమెను ఎమ్మిగనూరు స్థానాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు సభలో ఆమెను పరిచయం చేసిన సీఎం జగన్.. ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఆమె కూడా అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాయి. వాస్తవానికి బుట్టా రేణుక.. ఆర్థికంగా స్థితిమంతురాలు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 100 కోట్లు విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అలాంటి నాయకురాలిని పట్టుకుని అంతంతే అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాదు.. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆస్తులపైనా చర్చ జరుగుతోంది. ఆమె భర్త విద్యావ్యాపారంలో తల మునకలుగా ఉన్నారు.
This post was last modified on March 30, 2024 5:28 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…