చంద్రబాబు. ఈ పేరు కష్టానికి చిరునామా.. విజన్‌కు మారుపేరు. రాబోయే 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటానే విషయాన్ని ముందుగానే లెక్కలు వేసుకుని.. దానికి తగిన విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకునే నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరుంది. ఆది నుంచి ఆయన రాజకీయ జీవితం.. పూల పాన్పుపై ప్రయాణ మైతే కాదు. ‘కష్టం-లక్ష్యం’ అనే ఈ రెండు పట్టాలే ప్రాతిపదికగా.. చంద్రబాబు రాజకీయ ప్రయాణం సాగింది. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులోనూ చంద్రబాబు ఇదే ప్రయాణం కొనసాగిస్తున్నారు.
గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. అయితే.. ఇప్పుడు ఈ 50 రోజుల కష్టం వేరేగా కనిపి స్తోంది. గత నాలుగు రోజులుగా చంద్రబాబును పరిశీలిస్తే.. ఆయన నిద్రపోతున్నది కేవలం 4 గంటే నాలు గే గంటలు. మిగిలిన సమయం అంతా కూడా పార్టీకోసమే ఆయన పనిచేస్తున్నారు. ఒకవైపు టికెట్‌లు రాలేదని రగడ, మరోవైపు టికెట్లు ఇచ్చినవారు ఏమేరకు ప్రజలను కలుస్తున్నారు..? వారి గ్రాఫ్ ఎలా ఉంది? వంటి అనేక విషయాలను పరిశీలిస్తున్నారు.
ఇంకోవైపు.. వ్యక్తిగతంగా తన నియోజకవర్గం కుప్పంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు చంద్రబాబు. ఇక, కీలక నియోజకవర్గాల్లో వైసీపీ వేస్తున్న వ్యూహాలు, తాను అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలు.. ఇలా ఒకటా రెండా.. లెక్కకు మిక్కిలిగా చంద్రబాబు ప్రతి క్షణం కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టికెట్లు ప్రకటించిన తర్వాత. కూడా ఇప్పటికీ 50 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ముందుకు రాలేదు. తమకు టికెట్ ప్రకటించారని.. ప్రజలకు తమ మొహం చూపించాలని కూడా అనుకోలేదు.
కారణాలు ఏవైనా.. ఇలా చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు 40 రోజులకు పైగానే సమ యం ఉందని.. కాబట్టి ఇప్పుడే వెళ్తే.. సొమ్ములు కరిగిపోతాయని అనుకుంటున్న నాయకులు.. ఇప్పటి నుంచి కేడర్‌ను పోషించలేమని చెబుతున్న నేతలు కూడా కనిపిస్తున్నారు. మరికొందరు విజిట్ చేస్తున్నారు. ఉదయం సాయంత్రం, వాక్‌కోసం వెళ్లినట్టు వెళ్తున్నారు. దీంతో చంద్రబాబు కష్టం ప్రస్తావనకు వస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణ కాలం కూడా వేస్ట్ చేయకుండా ముందుకు సాగుతున్నారు. మరి ఈ స్ఫూర్తి నాయకులు కూడా తీసుకుంటేనే గెలుపు గుర్రం ఎక్కుతారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 30, 2024 11:57 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…