అవును ఈ విషయం ఇపుడు తెలుగుదేశంపార్టీలో సంచలనంగానే మారింది. ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం సిబిఐ విచారణ జరపటానికి ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర హోంశాఖ గనుక సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయం. ఈ విషయమే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండగానే తాజాగా ఏపి ఫైబర్ నెట్ స్కాంను కూడా సిబిఐ విచారణ జరిపాలంటూ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం బయటపడింది.
నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్, ఏపి ఫైబర్ నెట్ లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జిరగిందని వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే ఆరోపణలు చేస్తోంది. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే అనేక అంశాలపై మంత్రివర్గం ఉపసంఘంతో విచారణ కూడా చేయించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, ఏపి ఫైబర్ నెట్ వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఉపసంఘం కూడా తన నివేదికలో బయటపెట్టింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబు మద్దతుదారులు+ కొందరు టిడిపి సీనియర్లు అండ్ కో అమరావతి ప్రాంతంలో సుమారు 4077 ఎకరాలు సొంతం చేసుకున్నారని తేల్చింది. అలాగే ఫైబర్ నెట్ లో సుమారు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని కూడా రిపోర్టులో చెప్పింది.
ఫైబర్ నెట్ లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది చినబాబు లోకేషే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫైబర్ నెట్ వ్యవస్ధ ఐటి శాఖ పరిధిలోనే పనిచేసింది. ఐటి శాఖకు మంత్రి లోకేషే. ఈవిఎంల ట్యాంపరింగ్ లో బుక్కయి జైలుకు కూడా వెళ్ళొచ్చిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ ఫైబర్ నెట్ లో కీలక పాత్ర పోషించారు. వైసిపి నేతల ఆరోపణల ప్రకారం వేమూరి చంద్రబాబు, లోకేష్ కు బినామీ. ఈ ఆరోపణతోనే అప్పట్లో వైసిపి ప్రధానంగా లోకేష్ ను టార్గెట్ చేసింది. ఎటూ అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్పినట్లుగానే వెంటనే విచారణ కూడా చేయించింది. మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తేలిన విషయాల ఆధారంగా సిబిఐ విచారణకు సిఫారసు చేసింది.
ప్రభుత్వ సిఫారసును గనుక కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందిస్తే వెంటనే చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ విచారణ మొదలవ్వటం ఖాయం. దేశం మొత్తం మీద ఒకేసారి తండ్రి, కొడుకుల మీద సిబిఐ విచారణ జరగటం బహుశా ఏపిలోనే మొదటి కేసవుతుందేమో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సిఫారసు కార్యరూపంలోకి రావాలంటే ముందు నరేంద్రమోడి ఆమోదం పొందాలి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే సమయంలో సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగానే మోడి నిర్ణయం తీసుకుంటారా ? లేకపోతే బిజీగా ఉన్న కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తారా చూడాల్సిందే.
This post was last modified on September 14, 2020 6:03 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…