బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిలోనే ఆపశోపాలు పడుతున్నారు. కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. అయితే.. ఇవేంటనేది బీజేపీ తేల్చి చెప్పలే దు. దీంతో ఆయన మూడు దఫాలుగా 139 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే.. ఆయా స్థానాల లిస్టును కూడా బీజేపీకి ఇచ్చారు. అదేసమయంలో జనసేనకు కూడా 21 స్థానాలు ఇచ్చారు. ఈ పార్టీకి కూడా.. టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పంపించారు.
ఇంత వరకు క్లారిటీ పక్కాగా ఉంది. అంటే.. టీడీపీ ప్రకటించిన స్థానాలు కాకుండా. ఇతర స్థానాల్లో బీజేపీ అయినా.. జనసేన అయినా.. పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడే పెత్త సమస్య చంద్రబాబుకు వెంటాడుతోంది. తాము పోటీ చేస్తామని చెప్పి.. ఏకంగా.. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల స్థానాలను లాగేసుకుంది. ఇది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇప్పటికే ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
కానీ, తాజాగా ప్రకటించిన బీజేపీ జాబితాలో నాలుగు సీట్లు..ఆల్రెడీ టీడీపీ ప్రకటించినవే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిక్కు చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దీని నుంచి ఆయన బయటకు రాలేక.. అభ్యర్థుల ను సముదాయించలేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అనపర్తి స్థానం విషయం మరింత కఠినంగా మారింది. చంద్రబాబు కోసం .. కేసులు పెట్టించుకుని.. జైలుకు కూడా వెళ్లి వచ్చిన.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్నారెడ్డి తాజాగా తీవ్రంగాహర్ట్ అయ్యారు.
అనపర్తి అసెంబ్లీ స్థానం టీడీపీ ప్రకటించిన తర్వాత.. బీజేపీ లాగేసుకుంది. దీంతో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల ను దహనం చేశారు. తనకు టికెట్ ఇచ్చి.. బీజేపీ తీసుకునేలా చేశారని.. అదేదో ముందే చెప్పి ఉంటే.. తను తన దారి చూసుకునేవాడినని ఆయన ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్ చేశారు. బీజేపీ తరఫున ఏర్పడిన పరిస్థితులను చంద్రబాబువివరించే ప్రయత్నం చేశారు. కానీ నల్లమిల్లి మాత్రం నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించారు.
“పార్టీ కోసం ప్రాణాలొడ్డి మరీ పోరాడిన నన్ను ఇవాళ బలి చేశారు. మీకోసం తెగించి పోరాడిన కొద్దిమందిలో నేనూ ఒకడిని. ఆనాడు వైఎస్సార్ పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం పోరాడిన తీరును, ఇక్కడి శ్రేణులు పోరాటాలను మరిచారా?” అంటూ చంద్రబాబుకు వివరించారు. అంతేకాదు, అనపర్తిలో టీడీపీ ఉనికినే ప్రమాదంలో పడేశారని, ఇప్పుడు కాపాడుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు స్పష్టం చేయడం గమనార్హం. ఈయన వైసీపీలో చేరే అవకాశం ఉంది.
This post was last modified on March 28, 2024 11:29 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…