Political News

ఎవ‌రిని న‌మ్మాలి.. కేసీఆర్ స్వ‌యంకృతం!

రాజ‌కీయాల్లో పార్టీల అధినేతలు స్వ‌యంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నా.. వాటి మంచి చెడులు చెప్పే ఆంత‌రంగిక నాయ‌కులు అంటూ ఉండ‌డం అవ‌స‌రం. పెద్దా.. చిన్నా.. అన్ని పార్టీల‌కూ ఇది వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు బీజేపీ జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ఉన్నా.. అసలు నిర్ణ‌యాలు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు తీసుకుంటార‌ని అంటారు. ఒక్కొక్క‌సారి ముగ్గురూ క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యాలు చ‌ర్చించి తీసుకుంటారు. ఇది ఒక న‌మ్మ‌కం. వైసీపీలోనూ అంతే. సీఎం జ‌గ‌న్ త‌న‌కంటూ న‌లుగురు న‌మ్మ‌క‌స్తుల‌ను ఏర్పాటు చేసుకున్నారు.

తాను తీసుకునే నిర్ణ‌యాల‌పై వారితో చ‌ర్చిస్తారు. త‌ర్వాత వాటిని ఎవ‌రితో ఒక‌రితో ప్ర‌క‌టించేలా చేస్తారు. ఇది కూడా ఒక న‌మ్మ‌కం. ఇక‌, ఇప్పుడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప‌రిస్తితికి వ‌స్తే.. ఆయ‌న సంపూర్ణంగా న‌మ్మింది.. విశ్వాసం ఉంచింది.. త‌న కుమారుడు కేటీఆర్ పై కంటే కూడా.. కే. కేశ‌వ‌రావుపైనే. ఇది ముమ్మాటికీ వాస్త‌వం. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఈ విష‌యం ఆయ‌న చెప్పారు. “అనేక విష‌యాలు నా పెద్ద‌న్న కేశ‌వ‌రావుగారితో చెప్పాను. ఆయ‌న అంగీక‌రించారు. అందుకే ఇప్పుడు మీకు చెబుతున్నా” అంటూ. అభ్య‌ర్థుల విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుక‌ట్టాల‌న్నా.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి తీసుకురావాల‌న్నా.. కేసీఆర్ సంపూర్ణంగా చ‌ర్చించింది.. ముందుగా చెప్పింది.. కేకేతోనే. కానీ, ఇప్పుడు అంత న‌మ్మ‌కం పెట్టుకున్న కేకే.. పూర్తిగా హ్యాండిచ్చారు. పోయి పోయి.. బీఆర్ ఎస్‌ను వాన‌పామును చేయాల‌ని సంక‌ల్పం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజ‌కీయాల్లో జంపింగులు త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డ కేశ‌వ‌రావు.. కేసీఆర్ త‌ర్వాత‌.. అప్ర‌క‌టిత కేసీఆర్‌గా గ‌త ప‌దేళ్ల కాలంలో వెలిగారు.

వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మం సాగిన‌ప్పుడు.. కేశ‌వ‌రావు.. ప‌శ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్ర వాదిగా కూడా ముద్ర‌వేసుకున్నారు. కానీ.. రాష్ట్రం వ‌చ్చాక‌.. కేసీఆర్ చెంత‌కు చేరి.. త‌న ఎత్తుల‌తో కేసీఆర్‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ను న‌మ్మిన వారు.. ఉద్య‌మాన్ని ఉర్రూత లూగించిన వారిని కూడా ఆయ‌న కేసీఆర్‌కు దూరం చేశారు. త‌ద్వారా.. త‌న ప‌ద‌వులకు ఎస‌రు రాకుండా.. త‌న హ‌వా త‌గ్గ‌కుండా చూసుకున్నారు. చివ‌ర‌కు ఇంత న‌మ్మిన కేకే.. హ్యాండిచ్చారు. ఇక‌, ఇప్పుడు కేసీఆర్ ఎవ‌రిని న‌మ్మాలి?  అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. 

This post was last modified on %s = human-readable time difference 11:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాబిన్ హుడ్ అంటే చిరంజీవి కొండవీటి దొంగే

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతోంది. తొలుత 20 డేట్…

2 hours ago

మ‌రో వారంలో మ‌హాయుద్ధం.. గెలుపెవ‌రిది?

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ వ‌చ్చే బుధ‌వారం(న‌వంబ‌రు 20) జ‌ర‌గ‌నుంది. అంటే.. ప్ర‌చారానికి ప‌ట్టుమ‌ని 5 రోజులు మాత్ర‌మే ఉంది.…

3 hours ago

అమరన్ అద్భుత ఆదరణకు 5 కారణాలు

మాములుగా ఒక మీడియం రేంజ్ హీరో సినిమా ఒక వారం రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే బ్లాక్ బస్టర్ గా…

3 hours ago

NBK 109 టైటిల్ – బాలయ్య ఓటు దేనికి ?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య 109 టైటిల్ టీజర్ ఈ వారమే విడుదల కానుంది. ఉదయం 10…

6 hours ago

సందీప్ కిష‌న్‌కు రానా పెద్ద దిక్క‌ట‌

ద‌గ్గుబాటి రానా అంటే కేవ‌లం న‌టుడు కాదు. త‌న తాత‌, తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అత‌ను…

8 hours ago

డిజాస్టర్ల ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉంది

టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ ఒక ద‌శ‌లో ఫిదా, ఎఫ్‌-2 తొలి ప్రేమ లాంటి హిట్ల‌తో మంచి ఊపు…

10 hours ago