కేసు ఒక్కటే. అయితే.. నాయకులే డిఫరెంట్. అరెస్టు చేసిన సంస్థ కూడా ఒక్కటే. కానీ, ఉంచిన చోటే డిఫరెంట్. ఇలా.. ఇద్దరూ కూడా వేర్వేరు పరిస్తితులు.. వేర్వేరు హావభావాలనే ప్రకటించారు. వారే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరొకరు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితలు. ఈ ఇద్దరూ కూడా ఒకే కేసులో అరెస్టయ్యాయి. ఇద్దరినీ అరెస్టు చేసింది ఈడీనే.
అయితే.. ఢిల్లీ సీఎం ఇంకా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అక్కడ నుంచే పాలన చేస్తున్నారు. ఇక, కవిత విషయానికి వస్తే.. ఆమె విచారణ కొనసాగి.. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ కోసం కరడు గట్టిన నేరస్తులను ఉంచే తీహార్ జైలులో ఉంటున్నారు. మరి ఇద్దరు అతి పెద్ద ప్రొఫైల్ ఉన్న నాయకులు.. పైగా ఒకే కేసులో ఉన్న నాయకులు.. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది. ఈ విషయమే తాజాగా వెలుగు చూసింది.
కేజ్రీవాల్: ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. ముభావంగా .. బాధగా ఉన్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు.. ఆయన అన్నం తినడం లేదని.. కేవలం రెండు రకాల బిస్కట్లు మాత్రమే ఆహారంగా తీసుకుని పాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిద్ర కూడా పోవడం లేదని.. మధ్య మధ్యలో ఉలిక్కిపడినట్టు లేస్తున్నారని తెలిపారు. ఆయనలో తెలియని ఆవేదన కనిపించిందన్నారు.
కవిత: ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. తోటి మహిళా ఖైదీలతో కలిసిపోయారు. ఆమెను ఉంచిన సెల్‌లో మరో ఇద్దరు శిక్ష పడిన మహిళా ఖైదీలను ఉంచారు. అయితే.. ఈ ఇద్దరితోనూ కవిత కలిసి పోయారు. అంతేకాదు.. వారితో కలిసి అన్నం తింటున్నారు. కబుర్లు చెప్పుకొంటున్నారు. టీవీ చూస్తున్నారు. పుస్తకాలు చదువుకుంటున్నారు. మార్నింగ్ వాక్ కూడా ఆ ఇద్దరు మహిళా ఖైదీలతోనే చేస్తున్నారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారనేది పోలీసుల రిపోర్టు. ఇదీ.. కేజ్రీవాల్, కవితల మధ్య తేడా.
This post was last modified on March 28, 2024 7:59 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…