దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 దశలలో జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రాణసంకటంగా మారింది. ఇక, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గం కూడా ఉంది. ఆయన ఈ దఫా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ రెండో దశలో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో పరిశీలన జరగనుంది.
రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
రెండో దశలో పోలింగ్ జరిగే
రాష్ట్రాలు-స్థానాలు
కేరళలో – 20
కర్ణాటక – 14
రాజస్థాన్ – 13
మహారాష్ట్ర – 8
ఉత్తరప్రదేశ్ – 8
మధ్యప్రదేశ్ – 7
అసోం – 5
బీహార్ – 5
ఛత్తీస్‌గఢ్ – 3
పశ్చిమ బెంగాల్ – 3
మణిపూర్ -1
త్రిపుర-1
జమ్మూ కాశ్మీర్-1
This post was last modified on March 28, 2024 5:01 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…