ఏపీలో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి మరో టికెట్ కట్ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తొలి సారి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి 24 సీట్లు తీసుకున్న జనసేన.. తర్వాత బీజేపీ కోరిక మేరకు 3 సీట్లు త్యాగం చేశారు. దీంతో 24 కాస్తా 21కి పడిపోయింది. వీటిలో ఇప్పటికి 18 స్థానాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 3 స్థానాలకుఅ భ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు బీజేపీ మరో సీటు కోరుతోందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.
దీనిపై కేంద్ర నాయకత్వం కూడా పవన్‌కు ఫోన్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆ ఒక్క సీటును కూడా జనసేన నుంచి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఫలితంగా పవన్ కు 20 స్థానాలే మిగలనున్నాయని సమాచారం. వాస్తవానికి టీడీపీ-జనసేన పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ.. . ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను తీసుకుంది. ఇంకా వీటిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ, ఇంతలోనే మరో సీటు కోసం అభ్యర్థనలు ముందుకు వచ్చాయి.
పార్టీలో నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జనసేన వైపు వేళ్లు చూపిస్తోంది. దీంతో జనసేన నుంచే ఈ ఒక్క సీటును తీసుకునేందుకు బీజేపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలోనే ఆ పదకొండో స్థానం పై చర్చ సాగింది. కడప లేదా చిత్తూరు జిల్లాలలోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే.. టీడీపీ ఇప్పటికే దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేసింది. కేవలం 5 స్థానాలకు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇవి టీడీపీ వదులుకునే నియోజకవర్గాలు కావు. దీంతో బీజేపీ ప్రతిపాదనలను జనసేన కోర్టులోకి నెట్టేసినట్టు తెలుస్తోంది.
This post was last modified on March 27, 2024 12:11 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…