ఇప్పటి వరకు అటు అసెంబ్లీకైనా.. ఇటు పార్లమెంటుకైనా అభ్యర్థులను ప్రకటించేందుకు.. అంతా తన ఇష్టం అన్నట్టుగానే వ్యవహరించిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి అదికూడా చివరి నిముషంలో మాత్రం రూటు మార్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే..ఇటీవల కాలంలో కీలక నాయకులు జంప్ చేశారు. దీంతో రూటు మార్చుకుని.. అందరికీ ఫోన్లు చేసి.. అందరి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ టికెట్లను ఖరారు చేయడం గమనార్హం. తాజాగా తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది.
వీటిలో మూడు కీలక నియోజకవర్గాలకు బలమైన నాయకులను ఖాయం చేసింది. ప్రధానమైన భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఖరారు చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి పద్మారావు గౌడ్ ను ఎంపిక చేశారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేయనున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.
సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మొత్తానికి ఈ మార్పు వెనుక.. జంపింగుల ప్రభావం బాగానే పడిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on March 24, 2024 10:10 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…