టీడీపీకి ఇతర పార్టీలకు చాలా స్పష్టమైన తేడా ఉంది. టీడీపీకి సంస్థాగతంగా నాయకులు ఉన్నారు. సం స్థా గతంగా ఒక వ్యవహారం, పార్టీకి బలమైన కేడర్ ఉంది. వీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోయే నాయకులు కాదు. ఇతర పార్టీలను చూసుకుంటే.. ఈ పరిస్థితి ఉండదు. ఉదాహరణకు వైసీపీ వ్యక్తి ఆధా రిత పార్టీ. వైసీపీలో వ్యక్తి జగన్ ను బట్టి రాజకీయాలు జరుగుతాయి. కానీ, టీడీపీని వ్యక్తి నడిపిస్తారనే తప్ప.. వ్యక్తి ఆధారంగా పార్టీ లేదు. ఇది చాలా కీలక విషయం.
తెలుగు వారి ఆత్మ గౌరవం-అనే నినాదం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ టీడీపీ. వైసీపీ ఇలా వచ్చింది కాదు. దానికి ఒక ప్రాతిపదిక లేదు. ఏదో పార్టీ పెట్టారు.. సింపతీ, వారసత్వం వంటివి కలిసి వచ్చి పార్టీ విజయం దక్కించుకుంది. ఇది ఇంత వరకు పరిమితం. రేపు అక్కడ వీరే నాయకులు ఉండాలని వైసీపీ అధినేత కోరుకోవడం లేదు. వారు కూడా ఉండడమా.. ఉండకపోవడమా? అనేది వారి వ్యక్తిగత వ్యవహారం. మొత్తం గా అంటిపెట్టుకుని ఉండమనే సిద్ధాంతం వైసీపీకి లేదు.
ఈ రకంగా పోల్చుకున్నప్పుడు.. టీడీపీ డిఫరెంట్ పంథాలో ముందుకు సాగుతోంది. ఇక్కడ పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలం. జగన్‌ను అరెస్టు చేసినప్పుడు. ఆయన కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది. ఆందోళన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఎక్కడా బయటకు రాలేదు. కానీ, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మాత్రం కేడర్ కదిలింది. ఉద్యమం అంటే.. ఊపు తెచ్చింది. రాస్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది. నిరాహార దీక్షలు కూడా చేపట్టింది.
కట్ చేస్తే.. టికెట్లు పంపకాలు చేయాల్సి వచ్చిన వేళ… చంద్రబాబు వీటిని పరిగణనలోకి తీసుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం టికెట్ ఉందో లేదో కూడా చెప్పలేక పోతున్నారు. ఇస్తారో ఇవ్వరో.. ఇవ్వలేక పోతే..ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇది ఇప్పడు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. చంద్రబాబు ఆధారంగా అయితే ఎన్నికలు జరగవు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇలా చేసుకుంటే రేపు నిలబడేదెవరు? వైసీపీలో ఉన్న లెక్కలు, టీడీపీకి ఎప్పటికీ వర్తించవనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి.
This post was last modified on March 21, 2024 5:49 pm
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…