కీలకమైన పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసులతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రికి మరో షాక్ తగిలింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆపలేం
అంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ ఉదయం విచారించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టు కు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది. వాదనల సందర్భంగా ఈడీ తమ వాదనలను వినిపిస్తూ… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని చెప్పింది.
ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ కోర్టు తేల్చి చెప్పింది. కేసు ప్రస్తుత పురోగతి దృష్ట్యా ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టికి చెందిన మంత్రులు అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇక, ఇప్పటికే సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, వివిధ కారణాలతో ఆయన తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి జరిగిన విచారణలో కేజ్రీవాల్‌ను అరెస్టు నుంచి రక్షించలేమని కోర్టు తేల్చి చెప్పడం గమనార్హం.
This post was last modified on March 21, 2024 5:52 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…