ఏడాది మొత్తంలో సినిమాలకు బాగా కలిసి వచ్చే లాంగ్ సీజన్ అంటే.. వేసవే. సంక్రాంతికి వారం పది రోజులు ఉండే సందడి.. సమ్మర్లో దాదాపు రెండు నెలలు కొనసాగుతుంది. సినిమాలకు మహరాజ పోషకులైన యూత్.. స్కూళ్లు, కాలేజీలు అవగొట్టుకుని.. పరీక్షలు ముగించుకుని బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయటికి వస్తారు.
థియేటర్లను నింపేస్తారు. ఇక ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో థియేటర్లకు బాగా వస్తాయి. అందుకే ఈ సీజన్లో వారం వారం గ్యాప్ లేకుండా క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. మార్చి నెలాఖరు నుంచే పేరున్న సినిమాల సందడి మొదలైపోతుంది. ఏప్రిల్, మే నెలల్లో భారీ చిత్రాల హంగామా ఉంటుంది. ఐతే గత ఏడాది ఆశ్చర్యకరంగా సమ్మర్లో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాలేదు.
దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలే వేసవిని బాగా ఉపయోగించుకున్నాయి. సమ్మర్‌కు షెడ్యూల్ అయిన పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ఏడాది అలా ఉండదని.. పెద్ద సినిమాలు బాగానే సందడి చేస్తాయని అనుకున్నారు.
కానీ 2024 సమ్మర్ కూడా గత ఏడాదికి భిన్నంగా ఉండేలా కనిపించడం లేదు. వేసవికి షెడ్యూల్ అయిన భారీ చిత్రాల్లో ఒకటైన ‘దేవర’ ఆల్రెడీ వాయిదా పడిపోయింది. ఇక మిగిలిన ఆశలన్నీ ‘కల్కి’ మీదే నిలిచాయి. కానీ మే 9కి ఈ సినిమాను రెడీ చేయడం అసాధ్యం అని తెలుస్తోంది.
సినిమా రెడీ అయినా ఏపీ, తెలంగాణల్లో మే 13న ఎన్నికలు ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పదు. మొత్తంగా వేసవి రేసు నుంచే సినిమాను తప్పించడం ఖాయం అంటున్నారు. సమ్మర్లో ఇంకే పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కావట్లేదు. దీంతో గత ఏడాది లాగే టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డబుల్ ఇస్మార్ట్ లాంటి మిడ్ రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకోక తప్పదన్నట్లే.
This post was last modified on March 21, 2024 1:29 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…