తెలంగాణ టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుందా? గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. అయితే.. ఈ ప్రతిపాదన తమది కాదని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సీట్లు పంచుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. తెలంగాణలో తమకు క్లిష్టంగా.. టీడీపీకి ఈజీగా ఉన్న సీట్లలో టీడీపీకి అవకాశం ఇచ్చి.. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలకు చెక్ పెట్టాలనేది బీజేపీ నేతల వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ 15 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మంకు మాత్రమే పెండింగ్ పెట్టారు. ఖమ్మం నంచి జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా విడుదల చేసిన రెండు జాబితాలలోనూ జలగం పేరు రాలేదు. అలాగే వరంగల్ లో అభ్యర్థిగా భావించిన ఆరూరి రమేష్ చేరిక విషయంలోనూ హైడ్రామా చోటు చేసుకుంది. అందుకే ఆ సీటు ప్రకటననూ నిలిపివేశారు. ప్రస్తుతానికి ఆరూరి రమేష్ చేరినా..ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఆకస్మికంగా ఖమ్మం పార్లమెంటు సీటును టీడీపీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ అగ్రనేతలు చర్చిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మంలో టీడీపీకి పట్టుంది. పైగా.. పొరుగునే ఉన్న ఏపీతోనూ సరిహద్దులు పంచుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక, ఇక్కడ బీజేపీకి పట్టులేదు. అలాగని వదిలేయాలని బీజేపీ నేతలు భావించడం లేదు. బలమైన కాంగ్రెస్‌నుదెబ్బకొట్టాలంటే.. మిత్రపక్షాన్ని ఇక్కడ దింపి..త ద్వారా విజయం దక్కించుకుని.. తర్వాత తమలో ఆ ఎంపీని కలిపేసుకునే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఖమ్మంపార్లమెంటును గమనిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా ఉంది. పైగా.. మంత్రి భట్టి విక్రమార్క సతీమణి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడింది. గత ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ కాంగ్రెస్‌కు సహకరించింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లంతా టీడీపీ నేతల్ని కలిసి మద్దతు అడిగారు. ఖమ్మం రాజకీయ సమీకరణలతో.. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని సర్వేలు తేల్చడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంపై బీజేపీ అగ్రనేతలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
This post was last modified on March 20, 2024 10:29 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…