ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సోదరుడు(చిన్నాన్న కుమారుడు) వంగవీటి నరేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుస పెట్టి కాపు నేతలను, ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలరన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.
కొన్నిరోజుల కిందట.. చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఏకంగా వంగవీటి రాధా తమ్ముడిని పార్టీలోకి తీసుకున్నారు. వాస్తవానికి రాధా గత 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు.అ యితే, ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. ఇక, ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారనే చర్చసాగుతోంది.
ఇలాంటి సమయంలో రాధా సోదరుడిని పార్టీలోకి తీసుకోవడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, తాను బీజేపీ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలది నాలుగు దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. వంగవీటి రంగాను అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ టీడీపీతో ఎలా కలుస్తాడని నరేంద్ర ప్రశ్నించారు.
టీడీపీతో పొత్తు కుదుర్చుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తన సోదరుడు వంగవీటి రాధా గతంలో వైసీపీ నుంచి బయటికి వచ్చేసి తప్పు చేశాడని నరేంద్ర అన్నారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని, ఈ ఐదేళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. కాగా, ఈయనను పిఠాపురం, కాకినాడ జిల్లాల్లో వైసీపీ ప్రచారానికి వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. కాపు నాయకులను ప్రభావితం చేసేందుకు ఈయనను వాడేయనుందనే చర్చ సాగుతోంది.
This post was last modified on March 20, 2024 10:26 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…