పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీలోని 25 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ 17 స్థానాలు తీసుకుంది. బీజేపీ 6, జనసేన పార్టీ రెండు స్థానాలు పంచుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తీసుకున్న 17 పార్లమెంటు స్థానాల్లో 11 సీట్లకు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ఒకరు మాత్రమే సిట్టింగ్ అబ్యర్థి ఉన్నారు. మిగిలిన వారిలో అందరూ సామాజిక సమీకరణలు, ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉన్నవారు.. ఆర్థికంగా ఎన్నికలను తట్టుకునేవారికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
ఇదీ.. జాబితా
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు(సిట్టింగ్), విశాఖ పట్టణం – ఎం. భరత్(బాలయ్య రెండో అల్లుడు), అమలాపురం – గంటి హరీశ్(దివంగత గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడు. గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు), విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని, తొలి ప్రయత్నం), గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్(ఎన్నారై టీడీపీ నాయకుడు, ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయులు(వైసీపీ టికెట్ మార్చడంతో ఆ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చి టీడీపీలో చేరారు.)
ఒంగోలు – మాగుంట రాఘవరెడ్డి(ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు. ఈయన కూడా వైసీపీ టికెట్ నిరాకరించడం తో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో ఇటీవలే చేరారు. ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో నిలుపుతున్నారు) నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(ఈయన కూడా వైసీపీ నాయకుడే. రాజ్యసభ సభ్యుడు. వైసీపీ టికెట్ నిరాకరించడంతో భార్య ప్రశాంతి(టీటీడీ బోర్డు సభ్యురాలు)తో సహాబయటకు వచ్చారు. టీడీపీలో చేరి అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు దక్కించుకున్నారు.) చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్(తొల ప్రయత్నం), అనంతపురం – బి.కె. పార్థసారథి(టీడీపీ సీనియర్ నాయకుడు), నంద్యాల – బైరెడ్డి శబరి(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.ఈమె సీమలో ప్రముఖ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె. త్వరలోనే ఆమె టీడీపీలో చేరనున్నారు)
This post was last modified on March 19, 2024 9:15 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…