Political News

అటు ఇటు కాని హృద‌యాలు..

ఏపీ రాజ‌కీయాలు చిత్రంగా మారాయి. త‌మ‌కు టికెట్ ద‌క్క‌ని నాయ‌కులు.. పార్టీలు మారుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను ద‌గాకోరు.. న‌ర‌హంత‌కుల‌కు దాసోహం అయ్యారు అని విమ‌ర్శ‌లు గుప్పించిన టీడీపీ నాయ‌కులు, ఇటువైపు.. జ‌గ‌న్ అంత‌టి వాడు లేడ‌ని నెత్తీ నోరు బాదుకున్న నాయ‌కులు కూడా.. టికెట్లు ద‌క్క‌క పోవ‌డంతో పార్టీలు మారిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరిలో ఎస్సీ నేత‌లు ఇద్ద‌రు ఉండ‌గా.. వైసీపీ నుంచి ఓసీ నాయ‌కుడు కూడా ఉన్నారు.

వైసీపీ నుంచి

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు చాలా మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన నేతలు టీడీపీలో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీని వీడారు. శుక్ర‌వారం ఆయన రాజీనామా ప్రకటించారు. ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వేణుగోపాల్ రెడ్డి పని చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా తనకు సరైన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తిలో ఆయన ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

టీడీపీ నుంచి..

టీడీపీ నుంచి ఇద్ద‌రు ఎస్సీ నాయ‌కులు పార్టీని వీడుతున్నారు. వీరు వైసీపీతో ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. ఇద్ద‌రూ మాజీ మంత్రులే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రు పీత‌ల సుజాత‌(మాల‌). ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో విజ‌యం ద‌క్కించుకున్నారు. మంత్రి అయ్యారు. త‌ర్వాత అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో రెండేళ్ల‌కే ప‌క్క‌న పెట్టారు. 2019లో టికెట్ ఇవ్వ‌లేదు. ఇప్పుడైనా టికెట్ ఇస్తార‌ని భావించారు. కానీ, ఇవ్వ‌లేదు. ఇప్పుడు తాజాగా సెల్ఫీ వీడియో చేసి మీడియాకు అందించారు. తాను వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు పార్టీ అనుచరుల‌కు చెప్పారు.

ఇక‌, మరో నాయ‌కుడు కొత్త‌ప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్‌. ఈయ‌న కూడా మాజీ మంత్రి. మాదిగ సామాజిక వ‌ర్గం నేత‌. 2014కు ముందు వ‌ర‌కు ఆయ‌న టీచ‌ర్‌. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప‌లిచి కొవ్వూరు టికెట్ ఇచ్చారు. ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. రెండేళ్ల‌కు మంత్రిని చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో తిరువూరు టికెట్ ఇచ్చారు. ఆయ‌న ఓడిపోయారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కానీ, ఈ టికెట్ను ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఇచ్చారు. దీంతో నొచ్చుకున్న జ‌వ‌హ‌ర్‌.. వైసీపీకి చేరువ‌య్యారు. ఈయ‌న గ‌తంలో జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా వివేకా హ‌త్య కేసుపై అనేక ఆరోప‌ణ‌ల‌తో నిత్యం మీడియాలో ఉన్నారు.

This post was last modified on March 16, 2024 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరా సంగీతానికి తమన్ గైడెన్స్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…

2 hours ago

రీల్స్ చేసే వారికి రైల్వే శాఖ లేటెస్టు వార్నింగ్..

రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…

2 hours ago

వీరమల్లుని నిలబెట్టే 7 ఎపిసోడ్లు

అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…

2 hours ago

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

9 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

14 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

17 hours ago