టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారి పేర్లను విడుదల చేశారు. గతంలోనే తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు అప్పట్లో 94 మంది అభ్యర్థులను ఏకబిగిన విడుదల చేసేశారు. ఇక, ఇప్పుడు బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా టీడీపీకి దక్కిన 144 స్థానాల్లో మిగిలిన 50 సీట్లకు సంబంధించి 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో కొందరు వారసులకు కూడా టికెట్లు కేటాయించారు. అదేవిధంగా కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశలు ఫలించేలా చేశారు.
అదేవిధంగా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్‌ను కేటాయించారు. వెంకటగిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోడలు కురుగొండ్ల లక్ష్మీప్రియకు అప్పగించారు. మొత్తానికి ఆశావహులకు నిరాశ కలగకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తగానే రెండో జాబితాను ఎంపిక చేశారు. ఇదిలావుంటే.. జాబితాను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరు చెప్పిన వారికే, మీ అభిప్రాయం మేరకే టికెట్లు ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల సర్వే ఆదారంగానే అభ్యర్థులను ఎంపిక చేశానని, ఇప్పటికే తొలిజాబితాను ప్రకటించామని తెలిపారు. మరో 34 మందితో రెండో జాబితాను విడుదల చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ జాబితాలోనూ ప్రజల అభి ప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. వీరిని ఆశీర్వదించి.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
This post was last modified on March 14, 2024 3:59 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…