కాపులను ఏకం చేయడం.. వారి ఓటు బ్యాంకు బద్నాం కాకుండా తనకు అనుకూలంగా మార్చు కోవడం వంటి కీలక వ్యూహాల దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంతలోనే కాపు ఉద్యమ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, తన అబిమానులకు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు.
ఈ నెల 14న సీఎం జగన్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తాను 14వ తేదీన కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయలు దేరి సీఎంజగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి తప్పుడు పనిచేయలేదని.. చేయబోనని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం. తనను ప్రజలు ఆశీర్వదించాలని.. మీ బిడ్డగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. అయితే.. ఆయన వెంట ఎంత మంది కాపులు ప్రయాణిస్తారనేది చూడాలి.
మరో కీలక నేత విడివాడ రామచంద్రరావుకు తణుకు టికెట్ ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆయనతో బాగానే ఖర్చు పెట్టించారనే చర్చ సాగుతోంది. అయితే..ఈ టికెట్ కూడా దక్కలేదు. పోనీ..పవన్ . ఇలాంటి కీలక నేతలను పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఫలితంగా విడివాడ కొంత సంయమనం పాటించినా.. కాపుల నుంచి వస్తున్న వత్తిళ్లు.. భవిష్యత్ రాజకీయంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో జనసేనలో ఉండలేనని తాజాగా నిర్ణయించుకున్నారు.
తాజాగా అనుచరుల సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరేందుకు దాదాపు ఒక క్లారిటీకి వచ్చారని తెలిసింది. మొత్తంగా చూస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమన్న జనసేనకు మైనస్ అవుతుండగా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి ప్లస్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on March 13, 2024 6:05 pm
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…