రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివరాలను బయట పెట్టి తీరాల్సిం దేనని సుప్రీంకోర్టు మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు.. ఎంతెంత ఇచ్చారు? ఎవరెవరు దీనిని తీసుకున్నారు. వంటివివరాలను వెల్లడించాల్సిందే. దీనిలో మినహాయింపు లేదు
అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ కేసును గత వారమే విచారించిన కోర్టు.. బాండ్ల వివరాలను వెల్లడించాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలన్న బ్యాంకు విన్నపాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే 26 రోజులు గడిచినా పూర్తి సమాచారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని అడగడమేంటని నిలదీసింది. అలా అడగడం దేశంలోనే నంబర్ 1 బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ నిజాయతీపై సందేహాలు వచ్చేలా చేస్తోందని, పరువు తీసుకోవద్దని వ్యాఖ్యానించింది.
జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మార్చి 15 సా యంత్రం 5 గంటల్లోపు తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచాలని ఆదేశించింది. ఎస్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. “మాకు కొంత సమయం కావాలి. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపే శాం. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉంది” అని పేర్కొన్నారు.
తమ వద్ద అందరి వివరాలూ ఉన్నాయని, అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయన్నారు. వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటులో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే బ్యాంకు ఉద్దేశమని చెప్పారు. తీర్పును పరిశీలిస్తే.. బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉందని, ఈ రెండింటిని జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే 3 వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ సిద్ధగా ఉందన్నారు.
This post was last modified on March 11, 2024 5:16 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…