“టీడీపీ అధినేత చంద్రబాబుకు కలలో కూడా నేనే కనిపిస్తున్నా.. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదంట.. పాపం ఈ వయసులో చాలా కష్టపడుతున్నారు” అని వైసీపీ అదినేత, సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా బాపట్లలోని మేదర మెట్లలో నిర్వహించిన సిద్ధం చివరి సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ గుండెల్లో జగన్ రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వారికి కనీసం నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. “నన్ను ఓడించడం కోసం.. ఢిల్లీకి పరిగెట్టారు. అక్కడే కాపు కాచి మరీ బీజేపీ పెద్దల కాళ్లు మొక్కారు” అని అన్నారు.
“రెండు పార్టీల పొత్తుతో చంద్రబాబు.. ప్రజల బలమే బలంగా మనం తలబడబోతున్నాం. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. బాబు అండ్ కో.. పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటువైపు ఉంది. వాళ్లు వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో, ఎత్తులతో వస్తున్నారు. నాకు చంద్రబాబులా నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.. అందుకే ఒంటరిగానే పోటీ కెళ్తున్నా” అని జగన్ వ్యాఖ్యానించారు.
మీరే స్టార్ క్యాంపెయినర్లు..
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు లేరని సీఎం జగన్ అన్నారు. తన ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలే వైసీపీని గెలిపించుకునేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వస్టార్‌క్యాంపెయినర్లు ప్రతీ ఇంటా ఉన్నారని తెలిపారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అనేక పథకాలను ప్రజలకు అందించామని చెప్పారు. వీరంతా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
“విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగుతున్న యుద్ధం ఇది” అని జగన్ ఉద్ఘాటించారు. ప్రజలు ఆశీర‍్వదించడంతోనే మన ఫ్యాన్‌కు పవర్ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. “చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్ లేదు. చక్రాలు లేవు. తప్పు పట్టిన ఆ సైకిల్‌ను తోక్కడానికి ఆయనకు ఇతరులు కావాలి. అందుకోసమే ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నారు. ప్యాకేజీ స్టార్ సైకిల్ సీటు అడగడు. ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నాడని అడగడు. ప్యాకేజీ స్టార్ చంద్రబాబు సైకిల్ దిగమంటే దిగుతాడు. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్” అని ఎద్దేవా చేశారు.
This post was last modified on March 10, 2024 10:33 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…