Political News

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక రాజీనామా

భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది.

2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇప్పుడు కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అరుణ్‌ గోయల్‌‌ 2022 నవంబర్ లో నియమితులయ్యారు. 1985 పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. వాస్తవానికి ఆయన నియామకానికి 6 నెలల నుంచి ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2022 నవంబర్ 19న అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే కొంతకాలం కిందటే రిటైర్ కావడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మరోవైపు 2027 వరకు పదీకాలం ఉన్నప్పటికీ మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం గ‌మ‌నార్హం.

రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్నికల కమిషనర్లను నియమించనుందని తెలుస్తోంది. అయితే.. పంజాబ్ నుంచి ఎంపీ స్థానానికి గోయ‌ల్ పోటీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అది కూడా బీజేపీ నుంచేన‌ని తెలుస్తోంది.

This post was last modified on March 10, 2024 10:20 am

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

2 hours ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

3 hours ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

4 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

4 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

4 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

5 hours ago