టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గానికి నాలుగు వాగ్దానాలు చేశారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో టీడీపీ-జనసేన పార్టీలు నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో్ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనను గెలిపిస్తే.. మంగళగిరికి ఏం చేయాలని అనుకుంటున్నదీ నారా లోకేష్ వెల్లడించారు.
1) కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు… మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరిస్తాం.
2) మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టిస్తాం.
3) పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు. మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు. పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్తాం.
4) అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1
జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయనున్నాం. వచ్చే ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరిలో నెగ్గి మిత్రపక్షానికి గిఫ్ట్‌గా ఇస్తా.
This post was last modified on March 5, 2024 10:31 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…