తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ అయ్యింది. ప్రభుత్వం అనుమతితో నోటీసులు ఇవ్వటానికి కాచుక్కూర్చున్నది.
ఏ సంస్ధ నుండి అర్వింద్ ఎంతెంత డబ్బులు తీసుకున్నారన్న విషయం బాలకృష్ణ విచారణలో చెప్పేశారట. అలాగే ఆయన డైరీల్లో కూడా ముడుపుల వివరాలున్నట్లు సమాచారం. ఈ రెండు విషయాలు ఇలాగుండగానే తాజాగా ఔటర్ రింగ్ రోడ్డులో అధికార దుర్వినియోగం కూడా ఇపుడు అర్వింద్ మీదపడింది. ఓఆర్ఆర్ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, అవినీతి విషయాలను బయటకు తీయటంలో భాగంగా బాధ్యులందరిపైనా కేసులు పెట్టి విచారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఓఆర్ఆర్ నిర్వహణను అక్రమంగా మహారాష్ట్రకు చెందిన సంస్ధకు కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పదేపదే ఆరోపించింది. హెచ్ఎండీఏ కార్యదర్శిగా వ్యవహరించిన అర్విందే అప్పటి ఓఆర్ఆర్ లీజు వ్యవహారాన్ని కూడా పర్యవేక్షించారు. పారదర్శకంగా టెండర్లు పిలవకుండానే తమకిష్టమైన సంస్ధకు టెండర్ ఇచ్చేసిందని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంతే చాలా ఆరోపణలు చేశారు. అయితే అప్పటి మంత్రి కేటీయార్ తో పాటు అర్వింద్ కూడా తమ చర్యలను సమర్ధించుకున్నారు.
పైగా రేవంత్ ఆరోపణలన్నీ తప్పంటు అప్పట్లో అర్వింద్ మీడియా సమావేశం పెట్టి రెచ్చిపోయారు. లీజు వివరాలను ఇవ్వాలని రేవంత్ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తే వివరాలు ఇవ్వటానికి అర్వింద్ తిరస్కరించారు. దీనిపై రేవంత్ కోర్టులో కేసు వేస్తే అర్వింద్ ను జడ్జి బాగా చివాట్లు పెట్టారు. అయినా వివరాలు ఇవ్వటానికి అర్వింద్ ఇష్టపడలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాల్లో అర్వింద్ పూర్తిగా కూరుకుపోతున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం టార్గెట్ అర్వింద్ కాకపోవచ్చు అప్పటి మంత్రి కేటీయారే అయ్యుండచ్చు. కాని డైరెక్టుగా తగులుకుంటున్నది మాత్రం అర్విందే.
This post was last modified on February 29, 2024 1:01 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…