తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈరోజు మొదటి జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈvమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఈరోజు తెలంగాణా మొదటిజాబితా ప్రకటనపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలంగాణాలోని 17 స్ధానాల్లో మొదటి జాబితాలో ఎన్నిvసీట్లలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. పార్టీvవర్గాల సమాచారం ప్రకారం ఆరు నియోజకవర్గాలకు మొదటి లిస్టులో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందట.
అయితే ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాలే ఉంటాయని తెలిసింది. నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, కరీంనగర్లో బండి సంజయ్, సికింద్రాబాద్ లో కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్లుంటాయని సమాచారం. ఆదిలాబాద్ ఎంపి సోయం బాబూరావుకు టికెట్ విషయంలో క్లారిటి రావటంలేదు. పై ముగ్గురి పేర్లు కాకుండా అదనంగా ముగ్గురి పేర్లను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అయితే అన్నీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఫైనల్ చేసేశారట. కాని మొదటిజాబితా పేరుతో ఆరుగురిని మాత్రమే ప్రకటించాలని నిర్ణయించారట.
అదనంగా ప్రకటిస్తారని అనుకుంటున్న ముగ్గురిలో మల్కాజ్ గిరి స్ధానంలో ఈటల రాజేందర్, చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరిలో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, నాగర్ కర్నూలులో పీ రాములు ఉండచ్చని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 17 సీట్లలో కనీసం పది నియోజకవర్గాల్లో గెలవాలన్నది బీజేపీ టార్గెట్. అందుకనే రకరకాలుగా పరిశీలనలు జరిపి దరఖాస్తులను వడబోసి అభ్యర్ధులను ఎంపికచేస్తోంది.
మొదటిజాబితాలో ఆరుగురి పేర్లను మాత్రమే ఎందుకు ప్రకటిస్తోందంటే బీఆర్ఎస్ నుండి కొందరు ప్రజాప్రతినిధులు చేరబోతున్నారట. బీఆర్ఎస్ నుండి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఆరుగురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరే అవకాశముందని పార్టీనేతలు చెప్పారు. వీరు గనుక వస్తే అప్పుడు తాజా పరిస్ధితులను సమీక్షించి, నియోజకవర్గాల్లోని సీనియర్లతో చర్చించి అప్పుడు అభ్యర్ధులను ఎంపికచేసే ఆలోచనలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు లోకల్ నేతల సమాచారం. మరి వాళ్ళెపుడు చేరుతారు ? అగ్రనేతలు అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సిందే.
This post was last modified on February 29, 2024 11:10 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…