Political News

‘జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా’

“జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా”- అని వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసులో నిందితుడు, అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పాడు. రాజ‌కీయాల కార‌ణంగానే తాను ఇరుక్కు పోయి.. బ‌లి అయిపోయాన‌ని.. ఈ నేప‌థ్యంలో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌నేంటే చూపిస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ద‌స్త‌గిరి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఓ వ్య‌క్తిని హ‌త్య చేయ‌బోయాడ‌న్న కేసుపై గ‌త ఏడాది సెప్టెంబ‌రులో పోలీసులు అరెస్టు చేసి ద‌స్త‌గిరిని జైల్లో పెట్టారు. అయితే.. ఇటీవలే ఆయన బెయిల్ పైన విడుదల అయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు తాజాగా హాజ‌రైన ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వం తనను ప్రలోభాలకు గురి చేస్తుందని దస్తగిరి ఆరోపించాడు. వివేకా హ‌త్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రాం సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేసేలా తనపై ఒత్తిడి చేశారని అన్నారు.

వివేకా కేసు విషయంలో ఏపీలో రాజకీయంగా వైసీపీపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.. ఓట్లు పడని పరిస్థితి ఉంటుందని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. తనకు రూ.20 కోట్ల డబ్బులు ఆశ చూపారని దస్తగిరి ఆరోపించాడు. తనను అరెస్టు చేయాలని ఆర్డర్స్ వచ్చాయని.. అందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి రీకాల్ పిటిషన్ వేశానని చెప్పాడు. న్యాయమూర్తి కూడా దాన్ని అంగీకరించారని దస్తగిరి అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీకి సిద్ధంగా ఉన్నాన‌ని.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానే బ‌రిలోకి దిగుతాన‌ని చెప్పాడు.

అయితే.. త‌న‌దగ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. చందాలు పోగు చేసుకుంటాన‌ని వ్యాఖ్యానించాడు. ఇదిలావుంటే, తాను ఎవరికి భయపడేది లేదని చెప్పాడు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరాడు. రాజీకి రావాలని వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని, వివేకా హత్యలో పాల్గొని తప్పు చేశానని, మరోసారి అలాంటి తప్పు చేయదల్చుకోలేదని దస్తగిరి చెప్పాడు.

This post was last modified on February 27, 2024 10:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

10 hours ago