తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో అభ్యర్థుల పేర్లు చూసిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడింది. అదేమిటంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్ళగడ్డలో టికెట్ దక్కటం. అసలు అఖిలను పార్టీలో ఇంతవరకు ఉంచుకోవటమే చాలా ఎక్కువన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పేవి. కారణాలు తెలీటంలేదు కాని అఖిలను చంద్రబాబునాయుడు అనవసరంగా ఎంటర్ టైన్ చేస్తున్నారని కర్నూలు జిల్లాలోని నేతలు చాలాసార్లు కామెంట్లు చేశారు. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అయితే అఖిలను పార్టీలో నుండి పంపేయాలని గట్టిగా పోరాటం కూడా చేశారు.
అఖిల పరిస్ధితి పార్టీలో చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగంటే పార్టీలో ఆమెను కలుపుకుని వెళ్ళేవారు ఎవరూ లేరు. పార్టీ ఆపీసులోకి ఆమెను రానివ్వటం లేదు. అందుకనే ఆమె కూడా సపరేటుగా ఆపీసును పెట్టుకున్నారు. ఆమె మీద హత్యకు కుట్ర, కిడ్నాపులు, మోసాలు, ఫోర్జరీ, బెదిరింపుల్లాంటి అనేక కేసులు నమోదయ్యాయి. కిడ్నాపు కేసులో అరెస్టయి బెయిల్ మీదున్నారు. ఇంతటి వివాదాస్పద నేత జిల్లాలో ఇంకోరు లేరు. అందుకనే ఆమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడేవారు కాదు.
ఇలాంటి నేతకు ఎలాగూ టికెట్ రాదు కాబట్టి బయటకు వెళ్ళిపోవటమే మంచిదని చాలామంది అనుకున్నారు. అయితే తాజాగా ప్రకటించిన మొదటి జాబితాలోనే అఖిల పేరుండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఏ ప్రాతిపదికన అఖిలకు టికెట్ ఇచ్చారన్న విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. పార్టీలోనే కాదు చివరకు కుటుంబంలో కూడా అఖిలకు అందరు పూర్తిగా వ్యతిరేకమే. అఖిలకు టికెట్ ఇవ్వద్దని భూమా కుటుంబసభ్యులే చంద్రబాబుకు చెప్పారు. ఒకవేళ టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతుందని కూడా చెప్పారు.
అయినా సరే ఇంతమంది వ్యతరేకతను పట్టించుకోకుండా, గ్రౌండ్ లెవల్లో ఆమె మీదున్న వ్యతిరేకత తెలిసికూడా ఆమెకు టికెట్ ఇచ్చారంటే అఖిలను లక్కీ అనకుండా ఇంకేమనాలి. పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తున్న వాళ్ళలో కొందరికి టికెట్ దక్కలేదు. మరికొందరికి పొత్తులో సీట్లు పోయాయి. ఇవన్నీ పార్టీకోణంలో ఆలోచిస్తే ఎవరు ఏమిచేయలేరు. కాని అసలు పార్టీని పక్కనపెట్టి కేవలం తన ఎదుగుదలను మాత్రమే చూసుకుంటున్న అఖిలకు టికెట్ దక్కటాన్నే జిల్లాలోని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో.
This post was last modified on February 26, 2024 10:38 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…