తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి చాలామంది సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీసీసీ లెవల్లోనే కాకుండా తమకున్న పరిచయాలతో ఏఐసీసీ స్ధాయిలో కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంతో టికెట్ల కోసం సీనియర్ల నుండే రేవంత్ రెడ్డిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో వీలైనంతమంది సీనియర్లను పోటీలో నుండి తప్పించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అందుకనే టికెట్లకు ఆల్టర్నేటివ్ మార్గాన్ని రేవంత్ కొందరు సీనియర్లకు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే నామినేటెడ్ పోస్టులను ఆఫర్ చేస్తున్నారు.
మొన్ననే వరంగల్ ఎంపి టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టిన మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్యను స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ గా నియమించారు. తాజాగా స్టేట్ ప్లానింగ్ కమీషన్ వైస్ ఛైర్మన్ గా మాజీ మంత్రి చిన్నారెడ్డిని నియమించారు. చిన్నారెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక్కడి నుండి అభ్యర్ధిగా వంశీచంద్ రెడ్డిని స్వయంగా రేవంతే ప్రకటించారు. దాంతో చిన్నారెడ్డి నుండి ప్రయత్నాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకనే ఆయనతో మాట్లాడి పోటీనుండి తప్పిస్తు స్టేట్ ప్లానింగ్ వైస్ ఛైర్మన్ ఇచ్చారు.
ఖమ్మం, సికింద్రాబాద్ సీట్లకు బలమైన పోటీదారులుగా ఉన్న రేణుకాచౌదరి, అనీల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపారు. రాష్ట్రస్ధాయిలో క్యాబినెట్ హోదా కలిగిన కీలకమైన నామినేటెడ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఓ 15 పోస్టుల్లో ఎంపీ టికెట్ల కోసం పోటీపడుతున్న వారికి ఆఫర్ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారట. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ జారీచేసే నాటికి వీలైనంత పోటీని తగ్గించటమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారట.
17 సీట్లకు 309 మంది దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులను వడబోసి 50కి పట్టుకొచ్చారట. ఇందులో కూడా ఎంతమంది సీనియర్లను వీలైత అంతమందిని పోటీలో నుండి తప్పించాలంటే క్యాబినెట్ ర్యాంకున్న పదవులను ఆఫర్ చేయటమే మార్గమన్నది రేవంత్ ఆలోచన. ఎందుకంటే 17 నియోజకవర్గాల్లో కనీసం 14 సీట్లలో గెలవాలంటే పార్టీ యంత్రాంగమంతా ఏకతాటిపైన నిలబడి పనిచేస్తేనే సాధ్యమవుతుందని రేవంత్ అనుకుంటున్నారు. అందుకనే సీనియర్లను గుర్తించి నామినేటెడ్ పోస్టులను ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. టికెట్లకోసం బాగా పోటీ ఉన్న చేవెళ్ళ, మల్కాజ్ గిరి, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, జగిత్యాల లాంటి సీట్లలోని సీనియర్లను ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on February 25, 2024 2:00 pm
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…