ఔను.. ఈ మాట నిజమేనట. సాక్షాత్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా తాజాగా ఈ మాట అనేశారు. “ఆవిడ ఎందుకు ఏపీకి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆస్తులు, అప్పులు.. అనేవి సీఎం జగన్, షర్మిల మధ్య లేనే లేవు. షర్మిలకు సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు. దివంగత వైఎస్సార్ జీవించి ఉన్నప్పు డే.. వీరికి ఆస్తులు పంచి ఇచ్చేశారు. ఈ విషయం మీకు(మీడియా) తెలియకపోయినా.. సీమ వాసులుగా మాకు తెలుసు. పత్రిక, మీడియాల్లో వాటా ఆమె లేదు. అవి సీఎం జగన్ సొంత వ్యాపారాలు“ అని రోజా వ్యాఖ్యానించారు.
కొన్నాళ్లుగా వైసీపీఅధినేత, సీఎం జగన్‌పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా.. నియంత పాలన అంటూ ఆమె విరుచుకుపడ్డారు. అయితే.. ఇంతగా షర్మిల దూకుడు చూపించడానికి కారణం.. సీఎం జగన్ షర్మిలకు ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూనే ఉంది. గతంలో ఒకసారి షర్మిల కూడా.. సాక్షి పత్రిక, మీడియాలో తనకు వాటా కూడా ఉందని ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో మీడియా ముందే వ్యాఖ్యానించారు.
అయితే.. ఇతర ఆస్తుల పంపకాల విషయంపై షర్మిల మాట్లాడలేదు. ఇక, వీరి మాతృమూర్తివిజయమ్మ కూడా.. ఎక్కడా నోరు విప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్తుల వివాదం వల్లే..షర్మిల విభేదించి ఉంటుందనే వాదన ప్రతిపక్షాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక, రాజకీయ పార్టీని బలోపేతం చేసిన తర్వాత.. ఆమెను వదిలించుకున్నారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు ఆమె సొంతగా చేశారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఇది సీఎంజగన్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దీంతో రోజా వ్యాఖ్యల వెనుక తాడేపల్లి వర్గాలడైరెక్షన్ ఉండిఉంటుందనే సంహాలు వ్యక్తమవుతున్నాయి.
రోజా ఫైర్..
“తెలంగాణ బిడ్డని.. అక్కడి ప్రజలకు అండగా ఉంటానని.. నాలుగున్నరేళ్ల తరువాత షర్మిళ ఏపీకీ వచ్చి నానా యాగి చేస్తున్నారు. జగన్‌పై షర్మిళ విషం చిముతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిళని పావుగా వాడుతున్నారు. పవన్ కల్యాణ్ తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలి. వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిలకు ఆస్తులు పంచారు. సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు“ అని రోజా అన్నారు.
This post was last modified on February 23, 2024 3:55 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…