“మీ కన్నా చంద్రబాబే నయం జగనన్నగారూ” అంటూ.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తాజాగా డీఎస్సీ ఉద్యోగాల విషయంలో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చలో సెక్రటేరియెట్‌కు ఆమె పిలుపునిచ్చారు. అయితే.. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అనుమతులు లేకపోయినా నిరసన కొనసాగిస్తామంటూ.. రోడ్ల మీదకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయిన.. వైఎస్ షర్మిల, మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. “రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. 2.3 లక్షల జాబ్స్ ఇస్తామని జగన్ అధికారంలోకి వచ్చారు. 25వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉంటే.. 7వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని చంద్రబాబును నాడు అడగలేదా? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా? మీకన్నా చంద్రబాబే నయం” అని అన్నారు.
మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారని షర్మిల మండిపడ్డారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతు న్నారని, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఏపీ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఉద్యోగాలేవని ఆమె ప్రశ్నించారు. నిరసనలు తెలపాలనుకుంటే ఎక్కడికక్కడ నియంత్రించారని, రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
పోలీసులను మీ సేవకుల మాదిరిగా వాడుకుంటున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. “మీరేమైనా తాలిబన్లా?.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా?” అని నిప్పులు చెరిగారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆందోళన చేస్తే భయమెందుకని అన్నారు. జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామన్నారు.. ఒక్క జాబ్ క్యాలెండరూ ఎందుకివ్వలేదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా చంద్రబాబు కన్నా జగన్ పాలన అధ్వానంగా ఉందన్నారు.
సీఎం జగన్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం గొప్పలు చెబుతారన్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘చలో సెక్రటేరియట్’ చేపట్టి తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా.. ఆంధ్ర రత్న భవన్ వద్ద సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. దీంతో షర్మిలను అరెస్టు చేసే అవకాశంఉన్నట్టు తెలుస్తోంది.
This post was last modified on February 22, 2024 2:07 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…