టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురించి పైకి పెద్దగా ఏమీ విని పించడం లేదు. కనిపించడం కూడా లేదు. కానీ.. ఆమె సైలెంట్ వేవ్ సృష్టించే పనిలో ఉన్నారు. చాలా నిరాడంబరంగా ఉండే భువనేశ్వరి.. అంతే నిరాడంబరంగా పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో సాధ్యమైనంత మేరకు.. నారా భువనేశ్వరి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంతింతై .. అన్నట్టుగా సాగుతుండడం గమనార్హం.
45 ఏళ్లలో .. ఏనాడూ నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి రాలేదు. తన తండ్రి అన్నగారు ఎన్టీఆర్ హయాంలో అయితే.. ఎవరూ బయటకు వచ్చేవారు. నారా భువనేశ్వరి కూడా ఇలానే ఉండిపోయారు. 14 సంవత్సరా లు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనూ ఏ నాడూ రాజకీయాల్లోకి రాలేదు. అయితే.. వైసీపీ హయాంలో గత ఏడాది చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు.. తొలిసారి రాజకీయంగా ఆమె బయటకు వచ్చాయి. జైలు దగ్గర నుంచి పార్టీ కార్యాలయం వరకు.. కొన్ని కొన్ని సందర్భాల్లో నారా భువనేశ్వరి మాట్లాడారు.
రేటింగ్ వల్లే..
చంద్రబాబు జైల్లో ఉన్న సందర్భాల్లో నారా లోకేష్ కంటే కూడా.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ యా క్టివ్‌గా ప్రజల్లో ఉన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ కావొచ్చు.. చంద్రబాబుకు అనుకూలంగా చేపట్టిన నిరసనల్లోనూ నారా బువనేశ్వరి మాట్లాడారు. ఆమె మాట్లాడిన తీరు.. ప్రజలను బాగానే ఆకట్టుకుంది. టీవీ చానెళ్ల రేటింగ్ కూడా పెరిగింది. దీనికితోడు.. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే ఆయన జైలుకు వెళ్లారన్న వార్తను చూసి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం గమనార్హం.
నిజం గెలవాలి.. పేరుతో నారా భువనేశ్వరి.. పర్యటించారు. ఆయా సమయాల్లోనూ ఆమె ప్రసంగించారు. ఇది బాగానే ప్రజల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత.. ఇక, తాను రాను అని చెప్పారు. అంతా బాబు చూసుకుంటారని అన్నారు. కానీ, నారా భువనేశ్వరికి పెరిగిన గ్రాఫ్, మాట తీరు, ఆమెకు వస్తున్న ఆదరణను గమనించిన చంద్రబాబు.. ఆమెను ప్రోత్సహించారు. ప్రస్తుతం నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రల్లో జోరుగా పాల్గొంటున్నారు.
అంతేకాదు.. ఈ యాత్రల ద్వారా. ఆమె కేవలం బాధిత కుటుంబాలకు నగదు ఇచ్చి.. వారి బాధను పంచుకుని వెళ్లిపోతే.. పెద్ద విశేషం ఏం లేదు. కానీ, గత వారం నుంచి నారా భువనేశ్వరి వ్యూహంలో ప్రసంగాలు వచ్చి చేరాయి. పక్కా మాస్ డైలాగులు… వచ్చి చేరుతున్నాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. రాజకీయాలు వచ్చి చేరాయి. వైసీపీని ఓడించాలని కోరుతున్నారు. తాను కూడా పోటీ చేయాలని ఉందన్నారు. దీంతో నారా భువనేశ్వరి సైలెంట్ వేవ్ కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు.. వైసీపీ దీనిని పట్టించుకోలేదు. మరి ఎన్నికల సమయానికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 10:43 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…