Political News

ష‌ర్మిల అరెస్టుకు పోలీసుల య‌త్నం.. అర్ధ‌రాత్రి హైడ్రామా!

ఏపీలో అర్ధ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం ఉద‌యం చ‌లో సెక్ర‌టేరియెట్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై అభ్య‌ర్తులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్. ష‌ర్మిల ఈ ఉద్య‌మా నికి పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న కుమారుడి వివాహం అనంత‌రం.. నేరుగా బుధ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యం లో గ‌న్న‌వ‌రం చేరుకున్నారు. అక్క‌డ నుంచి ఆమె పార్టీ ముఖ్య‌నాయ‌కుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు నివాసానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ‘చ‌లో సెక్ర‌టేరియెట్‌కు’ అనుమ‌తి లేద‌ని పోలీసులు అప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. ‘చ‌లో సెక్ర‌టేరియెట్‌’ చేసి తీరుతామ‌ని.. కాంగ్రెస్ నాయ‌కులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ గృహ నిర్బంధాలు చేస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు 200 మంది నాయ‌కుల‌ను ఇంటికే ప‌రిమితం చేశారు. వీరిలో ర‌ఘువీరారెడ్డి, గిడుగు రుద్ర‌రాజు వంటివారు ఉన్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో విజ‌య‌వాడ మీదుగా కేవీపీ ఇంటికి చేరుకోవాల‌ని భావించిన ష‌ర్మిల‌ను పోలీసులు విమానాశ్ర‌యం నుంచే ఫాలో అయ్యారు. ఆమె ను అరెస్టు చేయ‌డం లేదా.. కేవీపీ ఇంటికి చేరుకుంటే.. అక్క‌డే గృహ నిర్బంధం చేయాల‌ని నిర్ణ‌యించారు.

అయితే. అప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌ల‌ను గృహ నిర్బంధం చేయ‌డంతో అలెర్ట్ అయిన‌.. ష‌ర్మిల‌.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని గుర్తించి వెంట‌నే త‌న మార్గాన్ని మార్చుకుని విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యం ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ఇక్క‌డే బుధ‌వారం రాత్రికి బ‌స చేశారు. అయితే.. పోలీసులు మాత్రం పార్టీ కార్యాల‌యాన్ని చుట్టుముట్టారు. ఇదిలావుంటే..ప్ర‌భుత్వ‌, పోలీసుల వైఖ‌రిపై ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదిక‌గా ఆమెనిప్పులు చెరిగారు. ఏం చేసినా పోరాటం ఆపేది లేద‌న్నారు.

ఇదీ.. రియాక్ష‌న్‌..

“నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే… మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు” అని ష‌ర్మిల పేర్కొన్నారు.

This post was last modified on February 22, 2024 12:40 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

39 minutes ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago