Political News

‘రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి!’

“రేపు నీ సాక్షికి కూడా అదే గ‌తి ప‌డుతుంది.. జ‌గ‌న్ రెడ్డీ! గుర్తు పెట్టుకో!! ” అని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మీడియా సంస్థ‌ల‌కు చెందిన విలేక‌రుల‌ను కొట్ట‌డం, ఒక మీడియా సంస్థ ఆఫీసుపై దాడి చేసిన నేప‌థ్యంలో బండారు పై విధంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “అధికారం శాస్వతం అనుకుంటున్నావు. కానీ, రేపు మారుతుంది. అప్పుడు నీ సాక్షి మీడియా, ప‌త్రిక‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఇప్పుడు జ‌రిగిన దానికి నాలుగింత‌లు జ‌రుగుతుంది” అని హెచ్చ‌రించారు.

అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని దుయ్య‌బ‌ట్టారు. “రెండు నెలలు తర్వాత మేం అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు? అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో. రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది” అని బండారు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇక, ప్ర‌స్తుతం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం జ‌గ‌న్‌పైనా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశా రు. ఈవెంట్ మేనేజర్‌ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటని ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి!

ఎయిర్ పోర్ట్ నుంచి శారదపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని బండారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ పెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. జగన్ ఏమ‌న్నా.. పాకిస్థాన్‌కు వ‌చ్చాడా? మేమేమ‌న్నా.. పాకిస్థాన్‌లో ఉన్నామా? అనినిల‌దీశారు. “విశాఖ ప్రజలకు జ‌గ‌న్ క్షమాపణలు చెప్పాలి. బూతు ర‌త్న కొడాలి నాని.. గంజాయి నాని.. ఆయన టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు.

This post was last modified on February 21, 2024 4:44 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

38 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

1 hour ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

3 hours ago