టీడీపీ కురువృద్ధ నాయకుడు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర టెన్షన్‌లో పడిపోతున్నారు. ఒక నిముషం.. ఉన్న వార్తలు.. మరో నిముషానికి మాయమైపోతున్నాయి. దీంతో ఆయన గత వారం రోజులుగా సోషల్ మీడియాకు కడు దూరంలో ఉన్నారని తెలిసింది. అంతేకాదు..ఆయన ఎవరిని కూడా పలకరించడం లేదని అంటున్నారు. తాజాగా ఆయన సెల్పీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తున్నా.. దీనిపై వైసీపీ మూకలు ఏదేదో సృష్టిస్తున్నారు. కానీ మీరు ఏవీ నమ్మొద్దు. అన్నారు. ఈ పోస్టుబాగానే వైరల్ అయింది.
అయితే.. దీనికి కొనసాగింపుగా.. అంటే.. బుచ్చయ్య ఇలా వ్యాఖ్యలు చేశారో.. లేదో మరో అరగంటలో మరో వీడియో హల్చల్ చేసింది. అది సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో. మరి దీనిని బుచ్చయ్య చూశారో లేదో తెలియదు కానీ.. చూసి ఉంటే ఆయనకు నిద్రపట్టేది కాదని అంటున్నారు పరిశీలకులు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ః టికెట్‌పై బాగానే ఆశలు పెట్టుకున్నారు. గత మూడేళ్లుగా ఆయన ఇక్కడ తిరుగుతున్నారు కూడా. అయితే, మధ్యలో ఆయన చేసిన కొన్ని కామెంట్లు కొంత వివాదంగా మారాయి.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని. అయితే, తన వారసుడిగా.. ఫలానా వ్యక్తిని నిలబెడుతున్నానని చెప్పుకొచ్చారు. దీంతో బుచ్చయ్య ఎలానూ తప్పుకొంటున్నారని పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదిలావుంటే. ఇప్పుడు తాజాగా పవన్ సంచలన వ్యాఖ్యలుచేశారు. రాజమండ్రి రూరల్ సీటును వదులుకునేది లేదన్నారు. అంతేకాదు.. ఈ సీటు విషయంలో చంద్రబాబును ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని.. ఇప్పటికే దీనిపై రెండు సార్లు చర్చించానని.. అవసరమైతే.. మరో పది సార్లయినా.. దీనిని చర్చిస్తానని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. కందుల దుర్గేష్ పార్టీకే కాదు.. తనకు కూడా వ్యక్తిగతంగా కావాల్సిన నాయకుడని పవన్ చెప్పకొచ్చారు. ఆయనను వదులుకునే పరిస్థితి లేదన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రూరల్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరేలా తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి విమర్శలు చేయొద్దని కూడా చెప్పారు. సో.. ఈ వ్యాఖ్యలు బుచ్చయ్య విన్నారో లేదో తెలియదు కానీ.. స్థానికంగా మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టేది లేదనడంతో బుచ్చయ్యను ఖచ్చితంగా తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వయసులో(80+) ఆయన ను ఇంత టెన్షన్ ఎందుకు పెడుతున్నారో.. చూడాలి. పోనీ.. ఏదో ఒక సీటు ఇచ్చినా.. ఆయన సర్దుకు పోయేందుకు రెడీగానే ఉన్నారు.
This post was last modified on February 21, 2024 1:31 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…