మొదటి నుండి కూడా బీఆర్ఎస్ లో కేసీయార్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నపుడు, అధికారంలో ఉన్న పదేళ్ళు కూడా ఇదే పద్దతి నడిచింది. కాని ఒకే ఒక ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు నాలుగు వైపుల పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీయార్ కొడుకు కేటీయార్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు మరో దగ్గరి బంధులు జోగినపల్లి సంతోష్ దారులు వేరయిపోయాయట.
అధికారంలో ఉన్నంత కాలం వీళ్ళు ఎలాగున్నా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళపైన కేసీయార్ అన్నీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకునే వారు. వీళ్ళకి కేసీయార్ బాధ్యతలు అప్పగించి ఓవరాల్ గా పర్యవేక్షణ చేసేవారు. దాంతో ఎక్కడైనా లోపాలున్నా, తప్పులు జరిగినా పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కాని ఓటమి తర్వాత నలుగురు నాలుగు దారులవ్వటంతో పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఓటమిదెబ్బకు కేసీయార్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కూడా కాలేదు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సొస్తుందనే కేసీయార్ రావటంలేదని కాంగ్రెస్ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాజా అసెబ్లీ సమావేశాలనే తీసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ దే వన్ మ్యాన్ షో అయిపోయింది. కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీయార్ తిప్పికొట్టలేకపోయారు.
దాంతో తాజా సెషన్లో కేటీయార్ సైడయిపోయి హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవిత తన జాగృతి సంస్ధను పెట్టుకుని వ్యవహారాలు నడుపుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పొరబాటున కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు రెండో టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీవర్గాల టాక్. పదేళ్ళ పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత, రాజ్యసభ ఎన్నిక తర్వాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో టాక్ వినబడుతోంది. వీళ్ళ మధ్య సమన్వయం చేయటంలో కేసీయార్ కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం ఎలుగంటుందో ఏమో చూడాలి.
This post was last modified on February 20, 2024 10:26 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…