గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తనయుడు, అప్పటికే మంత్రిగా కూడా పని చేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించి సంచలనం రేపిన నేత.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి, ఆ తర్వాత పార్టీ స్టాండ్‌కు తగ్గట్లే యుటర్న్ తీసుకోవడంతో స్థానికంగా చాలా వ్యతిరేకతే ఎదుర్కొన్నారు రామకృష్ణారెడ్డి.
జగన్ ఏం చెబితే అది చేసిన ఈ నేతకు ఈసారి టికెట్ లేదని సంకేతాలు రావడంతో ఆయన కొన్ని రోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జగన్‌ను తిట్టను అంటూ ఆయన సోదరి వైఎస్ షర్మిళ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్ల. ఆ పార్టీ తరఫునే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకుంటే.. ఉన్నట్లుండి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
షర్మిళకు షాకిస్తూ.. నెల తిరక్కముందే తిరిగి వైసీపీలో చేరిపోయారు రామకృష్ణారెడ్డి. ఈ రోజే ఆయన సీఎం జగన్‌ను కలిసి తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ రోజుకు సోషల్ మీడియలో ఇదే హాట్ టాపిక్. అసలు వైసీపీ నుంచి ఎందుకు పోయినట్లు.. ఇంతలోనే ఎందుకు తిరిగొచ్చినట్లు అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా జగన్ వేసిన స్కెచ్‌లో భాగమా అనే చర్చ కూడా జరుగుతోంది. షర్మిళ పంచన చేరి ఆమె ఆలోచనలన్నీ తెలుసుకునేందుకే ఆయన్ని కోవర్టుగా పంపారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇదే ఉద్దేశంతో ‘‘ఏజెంట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రిపోర్టింగ్ సర్’ అంటూ ఆళ్ల ఫొటో పెట్టి మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు తన కొడుకు ఎంగేజ్మెంట్ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి, మ్యారేజ్ టైంకి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయాడంటూ షర్మిళ అంటున్నట్లు కూడా ఒక మీమ్ రెడీ చేసి వదిలారు సోషల్ మీడియాలో. గత ఎన్నికల టైంలో, ఆ తర్వాత ఆళ్ల చేసిన విన్యాసాలతో ‘కరకట్ట కమల్ హాసన్’ అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు యాంటీ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన మరింతగా సోషల్ మీడియాకు టార్గెట్ కాబోతున్నారు.
This post was last modified on February 20, 2024 4:32 pm
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…