తరచుగా మీడియా సమావేశాలు రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషణ చేసే మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తాజాగా.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం దక్కించుకుంటారని అన్నారు. “చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలుస్తారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు” అని వ్యాఖ్యానించారు.
ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తాను మీడియా ముందుకు వచ్చినట్టు అరుణ్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో పార్లమెంటుకు హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. “ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంట్‌పై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు” అని అన్నారు. ఇది సరైన విధానమేనా? అని నిప్పులు చెరిగారు.
ఇక, నిధుల గురించి మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తోందన్న ఆయన అదే చేత్తో కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు పూర్తయినప్పటికీ విభజన హామీ చట్టం అమలు చేయడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏపీ సీఎంజగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం కోసం.. కేంద్రాన్ని ఏమేరకు ప్రశ్నించారో.. చెప్పాలని కోరారు. 22 మంది లోక్‌సభ సభ్యులు.. 9 మంది రాజ్యసభ సభ్యులు.. ఈ దేశంలో ఒక పార్టీకి ఉండడం గొప్ప విషయమని.. అయినా.. కూడా ఆయన ఏమీ సాధించలేక పోయారని.. రేపు ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
This post was last modified on February 18, 2024 10:57 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…