తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా సీఎం అవుతారో చూస్తానని సవాల్ రువ్వారు. తాజాగా పోలీసు నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. “సీఎంగా ప్రమాణం చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం వస్తోంది” అని సీఎం రేవంత్ అన్నారు.
నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించామని.. కానీ, ఉద్యోగ నియామకాలం కోసం తొమ్మిదిన్న రేళ్లపాటు బీఆర్ఎస్‌కు ఆలోచన రాలేదని విమర్శించారు. “నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్‌రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుంది. మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.
వీల్ చైర్ సానుభూతి కోసమే..
అసెంబ్లీకి రావాల్సిన మాజీ సీఎం కేసీఆర్ సభకు డుమ్మా కొట్టి నల్లగొండకు వెళ్లాడని సీఎం రేవంత్ అన్నారు. వీల్ చైర్‌లో తిరుగుతూ.. సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని ఇవాళ అసెంబ్లీలో ఓ అటెండర్ నాకు చెప్పారు” అని రేవంత్ అన్నారు. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదని, మేడిగడ్డ మేడిపండు.. పొట్టవిప్పితే అన్నీ పురుగులే ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
పదేళ్ల పాటు అధికారం కాంగ్రెస్‌దేనని రేవంత్ చెప్పారు. తానే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని.. కేసీఆర్ ఎలా వస్తాడో చూస్తామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 24గంటలూ కష్టపడి పనిచేస్తానని చెప్పారు. “మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తా అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా” అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on February 14, 2024 8:28 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…