రాజకీయాల్లో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు.. గెలుపోటములు సహజం. ఏది ఉన్నా లేకున్నా సాహసంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రతి విషయం మీదా అవసరానికి మించి ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో .. నానపెడుతూ అనవసరమైన విమర్శలకు అవకాశం ఇస్తుంటారు. ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. ఒక విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఏ విషయాన్ని తేల్చుకోలేక.. ఎవరినీ వదులుకోలేక.. చిన్న ప్రయోజనం కోసం తపిస్తూ అనవసరమైన తప్పులు చేస్తుంటారు.
అందరిని కలుపుకోవాలన్న పేరాశ.. ఆయనకు రివర్సు కొట్టేలా చేస్తుంది. ప్రతి ఒక్కరు చంద్రబాబు ఉద్దేశించి నెగిటివ్ గా మాట్లాడే ఛాన్సు ఇస్తుంటుంది. ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో తన తీరును మార్చుకోలేకపోతున్నారు. తాజాగా పెద్దల సభ రాజ్యసభకు నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. ఏపీ వరకు చూసుకుంటే.. ఒక రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే దగ్గర దగ్గర 44 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. మొదటి ప్రాధాన్య ఓట్లు భారీగా ఉండాల్సిన వేళ.. చంద్రబాబుకు మాత్రం కేవలం 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదం తెలపటం తెలిసిందే.
మరో రెండు రోజుల్లో ఏపీలోని మూడు ఖాళీ రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని సొంతం చేసుకోవాలని చంద్రబాబు తపిస్తున్నారు. ఇందుకోసం కొంత కసరత్తు చేసినప్పటికీ ఆయనకు కాలం కలిసి రాలేదనే చెప్పాలి. తాజాగా తనకు బలం లేకున్నా.. ఒక్క రాజ్యసభ సీటునైనా సొంతం చేసుకోవాలన్న తపన ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ సానుకూల వాతావరణం లేదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించటం లేదు. ఈ కారణంతోనే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై కిందా మీదా పడుతూ కసరత్తు చేస్తున్నారే తప్పించి.. పోటీకి దూరంగా ఉంటున్నామన్న స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించని పరిస్థితి. ఇలాంటి తీరుతో మైలేజీ కాదు.. ఉన్న మైలేజీ పోతుందన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
ఏపీలో ఖాళీ ఉన్న మూడు రాజ్యసభ స్థానాల కోసం అధికార వైసీపీ బరిలోకి దిగింది. అందుకు అవసరమైన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డి. మేడా రఘునాథ రెడ్డి.. గొల్ల బాబూరావులు నామినేషన్లు దాఖలు చేశారు. బలం లేని బాబు బరిలోకి అభ్యర్థులను దింపని పక్షంలో ఎన్నికల ప్రక్రియ అవసరం లేకుండా సీట్లు సొంతం కానున్నాయి. మరి.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on February 14, 2024 12:47 pm
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…