తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది.
ఇక నల్గొండ సభ మధ్యాహ్నం నల్గొండ పట్టణ శివార్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. పార్లమెంటు ఎన్నికలకు నాందిగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీయార్ ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభ. అందుకనే జిల్లా మొత్తం నుండి 2 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ ప్లాన్ చేశారు. ఆ సభలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున ధ్వజమెత్తేందుకు నిర్ణయించుకుని మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు.
అయితే అనూహ్యంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం తీర్మానంచేసింది. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ ప్రభుత్వం కేఆర్ఎంబీకి తెలంగాణా ప్రాజెక్టులను అప్పగిస్తు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పదేపదే అసెంబ్లీలో చెప్పారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కావాలనే బురదచల్లేస్తున్నట్లు ఎదురుదాడి చేశారు. తమ చిత్తశుద్ది ఇది అని నిరూపించేందుకు తెలంగాణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తీర్మానం కూడా చేశారు. ఇపుడేమైందంటే మధ్యాహ్నం నల్గొండలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదని తేలిపోయింది.
తెలంగాణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ముడిపెట్టి ఆరోపణలు చేయాలని అనుకున్నపుడు అసలు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో ఈ చర్చనే లేవనెత్తకుండా ఉండాల్సింది. బయట కూడా ఎక్కడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావించకుండా ఉండుంటే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. అప్పుడు బహిరంగసభలో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి కేసీయార్ కు కావాల్సినంత అవకాశం దొరికుండేది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించుంటే ప్రభుత్వం ఇరుకునపడుండేది. కాని ఇపుడు బీఆర్ఎస్ చేసిన పనివల్ల ప్రభుత్వం మేల్కొని తీర్మానం చేయటంతో కేసీయార్ ప్లాన్ రివర్సు కొట్టినట్లయ్యింది.
This post was last modified on February 13, 2024 10:08 am
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…