భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు దేశాన్ని పాలించారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదరికాన్ని రూపు మాపేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పథకాలు కూడా తీసుకువచ్చారు. అందుకే వారిలో చాలా మందిని దేశం భారతరత్న
వంటి సమున్నత సత్కారాలు అందించి.. గౌరవించింది. అయితే.. వీరందరినీ తోసిరాజని.. ఇప్పుడు.. దేశ ఉత్తమ ప్రధానిగా ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీ నిలిచారట.
ఈ మేరకు దేశంలో పనిచేసిన ప్రధానుల పనితీరును ఒడబోసి.. తాజాగా ఇండియా టుడే
సంస్థ ఒక స ర్వే చేసింది. ఈ క్రమంలో దేశానికిసేవలందించిన అనేక మంది ప్రధానుల విషయంపై ప్రజలను కలిసిం ది. వీరి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. తాజాగా.. ఉత్తమ ప్రధాని ఎవరనేది తేల్చి చెప్పింది. `ఇండియా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
ప్రకారం.. దేశ ప్రజల్లో 44 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి జై కొట్టారు.
ఇక, గరీబీ హఠావో నినాదంతో దేశవ్యాప్తంగాపే కూడు-గూడు-గుడ్డ
వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేసిన ఇందిరమ్మ ఈ వరుసలో మూడో స్థానానికి పడిపోయారు. ఆమెకు కేవలం 14 శాతం మంది ప్రజలు మాత్రమే జై కొట్టారు. అదేసమయంలో బీజేపీ అగ్రనాయకుడు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి.. 15 శాతం మంది ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు. మౌన ముద్రతో పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన.. మాజీ ప్రధాని.. ప్రస్తుతం జీవించి ఉన్న మన్మొహన్ సింగ్ 11 శాతం మంది ప్రజల మద్దతునే కూడగట్టుకున్నారు.
కానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం.. 44 శాతం మంది ప్రజల మద్దతు కూడగట్టుకున్నట్టు ఇండియా టుడే సంస్థ సర్వే వెల్లడించింది. దీనికి కారణాలుగా ఆయన దూరదృష్టి.. వ్యూహాలను పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, సీఏఏ వంటి కీలకమైన పౌరసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తుండడం.. అదేసమయంలో రామమందిర నిర్మాణం వంటివి ఆయనను హీరోను చేసినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
This post was last modified on February 12, 2024 5:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…