ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణా రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటు కమలనాథులు ఊదరగొడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండటమే విచిత్రంగా ఉంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేపదే బీజేపీని కార్నర్ చేసేది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అంటు బాగా ప్రచారం చేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రచారం వల్ల కమలనాథులు బాగా ఒత్తిడికి గురయ్యారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేక నానా అవస్తలు పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రెండు నెలలు గడిచేటప్పటికి బీఆర్ఎస్ బాగా నీరసించిపోతోంది. ఇదే అదునుగా బీజేపీ కారు పార్టీ మీద మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు చాలామంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఏ రోజు ఏ ఎంఎల్ఏ బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి జంప్ చేస్తారో తెలీటంలేదు. జంపింగుల విషయంలో కేసీయార్, కేటీయార్ లో అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం. ఇప్పటికి ఆరుగురు ఎంఎల్ఏలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ ను కలిశారు.
వీళ్ళు కాకుండా మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారు. అలాగే మాజీమంత్రి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రేవంత్ ను కలిశారు. ఇలాంటి బీఆర్ఎస్ నేతల్లో చాలామంది తొందరలోనే కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయం. బీఆరఎస్ నేతలు ఇంతమంది రేవంత్ ను కలుస్తున్నా బీజేపీ నుండి ఎవరూ ఇంతవరకు రేవంత్ ను నేరుగా కలవలేదు. దీన్ని ఉదాహరణగా చూపించే బీఆర్ఎస్ పైన కమలనాథులు మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని కిషన్ రెడ్డి అండ్ కో పదేపదే గోలచేస్తున్నారు.
This post was last modified on February 12, 2024 4:36 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…