రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల ఎంపిక ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. గాంధిభవన్లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటి (పీఈసీ) ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించింది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి 309 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ మిస్సయిన నేతలు, పార్లమెంటు టికెట్ హామీని పొందిన సీనియర్ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఇపుడు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయన్న అంచనాతోనే 17 స్ధానాలకు ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు అందాయి. వాటిని షార్ట్ లిస్టు చేయటం కోసమే పీఈసీ మీటయ్యింది. సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను సమావేశం కుదించింది. అంటే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లతో జాబితాను రెడీచేసింది. నియోజకవర్గాల వారీగా జాబితాలను రెడీచేసిన సమావేశం సీల్డ్ కవర్లో ఉంచింది.
ఆ సీల్డ్ కవర్ను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి అందించింది. స్క్రీనింగ్ కమిటి ఈనెల 19వ తేదీన సమావేశం అవబోతోంది. నియోజకవర్గానికి అందిన మూడుపేర్లపైన కమిటి సభ్యులు చర్చిస్తారు. వీళ్ళల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చిత్తశుద్దితో పనిచేసిందెవరు ? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు ఎవరెంత పనిచేశారు ? అభ్యర్ధుల నేపధ్యం, పార్టీలో ట్రాక్ రికార్డు లాంటి అంశాలపై సర్వే మొదలైంది.
19వ తేదీన స్క్రీనింగ్ కమిటి సమావేశం నాటికి వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం తమ సర్వేని పూర్తిచేసి రిపోర్టు రెడీ చేస్తుందని పార్టీవర్గాలు చెప్పాయి. తమకు అందిన మూడుపేర్ల జాబితాలను, సునీల్ కనగోలు టీమ్ ఇచ్చే సర్వే రిపోర్టును పోల్చుకుని కమిటి మూడుపేర్లలో ప్రయారిటి ప్రకారం టిక్ పెడుతుంది. స్క్రీనింగ్ కమిటి రెడీచేసిన ప్రయారిటి లిస్టును ఢిల్లీకి పంపుతారు. మళ్ళీ అక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సమక్షంలో స్క్రీనింగ్ కమిటి సమావేశమై ప్రయారిటి జాబితాపై చర్చిస్తుంది. అక్కడ ఫైనల్ అయిన ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుకు జాబితా వెళుతుంది. అక్కడ అభ్యర్ధులను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియంతా వీలైనంత తొందరగా పూర్తిచేసి అభ్యర్ధులను ప్రచారానికి దింపాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ చేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2024 10:51 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…