రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా వినలేదు. పైగా మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు.
వివిధ కారణాలతో చివరి నిముషంలో 12 చోట్ల సిట్టింగులను కాదని కొత్తవారికి టికెట్లిచ్చారు. ముందుగా టికెట్లు ప్రకటించిన సిట్టింగుల్లో చాలామంది ఓడిపోయారు. చివరినిముషంలో కొత్తవారికి టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ 10 చోట్ల గెలిచింది. దీంతోనే సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్ళీ టికెట్లివ్వటం ఎంతపెద్ద తప్పో కేసీయార్ కు అర్ధమైంది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎంఎల్ఏల మీద మంటతో జనాలు చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించటంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్త పడాలని అర్ధమైనట్లుంది.
అందుకనే సిట్టింగ్ ఎంపీల్లో చాలామందిని మార్చేయాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల టాక్. అవకాశం ఉంటే అందరినీ మార్చేయాలని కాదు కూడదని అనుకుంటే ఎక్కడైనా మంచి ఇమేజి ఉన్న సిట్టింగులకు మాత్రం టికెట్ ఇవ్వాలని అనుకున్నారట. పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తొమ్మిది మంది ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎంఎల్ఏగా గెలిచిన కొత్తా ప్రభాకరరెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ లో చేరిన కారణంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేశారు.
అంటే స్ధూలంగా బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. వెంకటేష్ రాజీనామా ఆమోదిస్తే బలం ఏడుకు తగ్గుతుంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే మొత్తం 17 నియోజకవర్గాల్లో ఫ్రెష్ ఫేసెస్ ను రంగంలోకి దింపాలని కేసీయార్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావటంతో పాటు జనాలు కూడా హ్యాపీగా ఫీలవుతారని, అప్పుడు పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందని అనుకుంటున్నారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఎంపీలుగా పోటీలోకి దింపే ఆలోచన కూడా లేదట. అందుకనే గట్టి నేతలకోసం కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 10:48 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…