అభ్యర్ధుల ఎంపిక కోసం మళ్ళీ సర్వేలు మొదలయ్యాయి. తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో తెలుసుకునేందుకు కేసీయార్ మళ్ళీ సర్వేలు చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లోను కేసీయార్ ఆదేశాలమేరకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. తనకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో అధినేత ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీయార్ ఒకటికి మూడు నాలుగుసార్లు సర్వేలు చేయించుకున్న విషయం తెలిసిందే.
అన్ని సర్వేలు చేయించుకున్న కేసీయార్ చివరకు ఏమిచేశారు ? ఎందుకు ఓడిపోయారన్నది వేరే విషయం. ఎందుకంటే సర్వేలు చేస్తున్నదెవరు ? సర్వే రిపోర్టుల్లో ఏముంది ? సర్వేల్లో ఎవరికి ప్లస్సుంది ఎవరికి మైనస్సుందన్న విషయాలు కేసీయార్ కు తప్ప మరొకరికి తెలీదు. అందుకని సర్వేల ఆధారంగానే కేసీయార్ టికెట్లు ఫైనల్ చేశారా లేకపోతే ఇంకేదైనా మార్గముందా అన్న విషయమై చర్చలు అనవసరం. ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ సర్వేలు చేయిస్తున్నది మాత్రమే నిజం.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను మాత్రం మళ్ళీ రిపీట్ చేయకూడదని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్ధుల ఎంపికలో సర్వే సంస్ధలతో పాటు పార్టీ ఇంటెలిజెన్స్ ను కూడా రంగంలోకి దించారట. అభ్యర్ధులుగా ఎంపిక చేయబోయే వారి నేపధ్యంతో పాటు వాళ్ళ ఆర్ధిక స్ధితిగతులను కూడా అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏల ట్రాక్ రికార్డు, వాళ్ళపైన ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోకుండా అచ్చంగా ఆర్ధిక పరిస్ధితులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అందుకనే రిజల్టు పూర్తిగా నెగిటివ్ గా వచ్చాయి.
అందుకనే పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో నేతల ట్రాక్ రికార్డుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే జనాల్లో మంచి ఇమేజి ఉండి, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న నేతలను పోటీలోకి దింపితే మంచి రిజల్టు వస్తుందని కేసీయార్ భావిస్తున్నారట. కారణం ఏమిటంటే అవసరమైన అభ్యర్ధులకు పార్టీయే నిధులను సర్దుబాటు చేయాలని కేసీయార్ అనుకున్నారట. కాబట్టి మంచి ట్రాక్ రికార్డున్న నేతలనే అభ్యర్ధులుగా ఎంపిక చేయటానికే సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on February 5, 2024 4:34 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…