2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.. డాక్టర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తున్నామని.. ఏక్షణమైనా లేపేస్తామని కొందరు వ్యక్తులు తనను బెదిరిస్తున్నట్టు ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తనకు భద్రత కల్పించాలని ఆమె వేడుకున్నారు. ఈ మేరకు సునీత.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, తన సోదరి షర్మిలకు కూడా ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.
ఏం జరిగింది?
వివేకానందరెడ్డి మరణం వెనుక సొంత మనుషులే ఉన్నారని, రాజకీయ కారణాలతోనే ఈ హత్యకు పాల్పడ్డా రని ఈ హత్య కుట్రకు పాల్పడిన వారికి సొంత మనుషులే అండగా ఉన్నారని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తనకు న్యాయం చేయాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు.. సహా ఆయనను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో మరో న్యాయ పోరాటం సమాంతరంగా చేస్తున్నారు.
ఇదిలావుంటే.. మరోవైపు, సునీతను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల షర్మిల కడప పర్యటనలోనూ సునీత పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రం చేయొచ్చని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్రమంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్‌లు రావడం.. ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది.
చంపేస్తాం, లేపేస్తాం.. ఇక రోజులు లెక్కపెట్టుకో.. అంటూ.. తనను ఫేస్‌బుక్ లో హెచ్చరిస్తున్నారని డాక్టర్ సునీత సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కూడా తెలిపారు. తనను, వైఎస్ షర్మిలను “లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు ఉండడం.. సునీత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.
This post was last modified on February 2, 2024 3:26 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…