Political News

ఏపీలో బీఆర్ఎస్.. తోట యూట‌ర్న్‌

ఏపీలో రాజ‌కీయాలు వ‌డివడిగా మారుతున్నాయి. నాయ‌కులు త‌మ త‌మ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌(భార‌త రాష్ట్ర‌స‌మితి) ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం లేక పోవ‌డం.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ.. తెలంగాణ‌కే ప‌రిమితం కావ‌డం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

వాస్త‌వానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్ర‌శేఖ‌ర్‌.. కాకినాడ లేదా.. రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్న‌తాధికారి కావ‌డంతో ఆయ‌న ఈ ప్లాన్ వేసుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పోటీ నుంచి విర‌మించుకున్న ద‌రిమిలా తోట‌.. త‌న రూటు మార్చుకున్నారు. జ‌న‌సేన వైపు ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల నుంచి ఆయ‌న జ‌న‌సేన‌తో చ‌ర్చలు కూడా జ‌రుపుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు.. ఇదే బీఆర్ఎస్ కు చెందిన ఏపీ నాయ‌కుడు రావెల కిశోర్‌బాబు.. తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు.

ఇక‌… ఇప్పుడు.. తోట నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌.. మెగా స్టార్ చిరును క‌లుసుకున్నారు. ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశామ‌ని చెబుతున్నా.. రాజ‌కీయంగా అంత‌ర్గ‌త చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది. తోట చంద్ర‌శేఖ‌ర్ .. ఈ నెల 4న జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్టు వార్త‌లు గుప్పు మంటున్నాయి. అదే రోజు మ‌రో కాపు నేత‌.. వైసీపీ ఎంపీ బాల‌శౌరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక‌, ఇప్ప‌టికే బాల‌శౌరికి మ‌చిలీప‌ట్నం ఎంపీ టికెట్‌ను ఖ‌రారు చేశారు.

ఇక‌, ఇప్పుడు తోట‌కు గుంటూరు వెస్ట్ సీటు ఖాయం చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వాను త‌ట్టుకుని మ‌రి.. ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి తోట నిల‌బ‌డే చాన్స్ మెండుగా ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం. దీనికి తాజాగా చిరును ఆయ‌న క‌ల‌వ‌డం.. అభినందించ‌డం మ‌రింత ప్రాధాన్యం క‌లిగించేలా చేసింది. ఏదేమైనా.. ఏపీలో మార్పులు జోరుగానే సాగుతున్నాయి.

This post was last modified on February 2, 2024 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

4 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

4 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

5 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

5 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

5 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

5 hours ago