రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేయటానికి డిసైడ్ అయిపోయినట్లుంది. ఎందుకంటే మిత్రపక్షమని చెప్పుకుంటున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. ఇపుడు అభ్యర్ధులను కూడా ఫైనల్ చేసుకుంటోంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయన్నది స్పష్టమైంది. బీజేపీ కూడా కలుస్తుందని అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు కాని కమలనాదుల నుండి అలాంటి సానుకూలత ఏమీ కనిపించటంలేదు. పైగా ఈమధ్య ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ లో పొత్తుల విషయం చర్చకు వచ్చిందట.
ఆ సందర్భంగా నరేంద్రమోడి మాట్లాడుతు బీజేపీ, జనసేనలు మాత్రమే మిత్రపక్షాలుగా ఎన్నికలకు వెళతాయని చెప్పారట. ఒకవేళ జనసేన గనుక కలిసిరాకపోతే బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తుందని కూడా చెప్పేశారని పార్టీవర్గాల సమాచారం. ఆ తర్వాత 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటు అభ్యర్ధుల ఎంపికలో ఆశావహులను గుర్తించేందుకు ప్రాసెస్ మొదలైంది. జాతీయ నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాల కారణంగానే ప్రతి జిల్లాకు ముగ్గురు పరిశీలకులతో రాష్ట్ర అధ్యక్షరాలు కమిటీలను నియమించారు.
ఈ కమిటీలు అన్నీ జిల్లాల్లో తిరిగి పోటీచేసే విషయంలో ఆసక్తి ఉన్న నేతల నుండి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. తాజా అప్ డేట్ ఏమిటంటే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం బీజేపీ ఎన్నికల ఆపీసులను ఓపెన్ చేయబోతోంది. ఒంటరిపోటీకి రెడీ అయిపోయింది కాబట్టే రాష్ట్రంలో చాలాచోట్ల బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటు వాల్ పోస్టర్లను అంటిస్తోంది.
అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా పార్టీ నియమించింది. ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేయటానికి 4వ తేదీనుండి అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాధ్ సింగ్ తదితరులు రెగ్యులర్ గా పర్యటించబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 9,10 తేదీల్లో రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్యులతో రోడ్డుషోల్లాంటివి ప్లాన్ జరుగుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో టికెట్ల కోసం 2438 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం. మరి వీటిని ఎప్పుడు వడపోస్తారో చూడాలి.
This post was last modified on February 1, 2024 3:08 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…