తన వంటకాలతో ఆహార ప్రియులను ఆకట్టుకుని.. యూట్యూబర్ల చలవతో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన కుమారి ఆంటీ వ్యవహారం.. కీలక మలుపు తిరిగి.. సమస్య పరిష్కారం అయిపోయింది. ఆంటీ జోలికి వెళ్లద్దంటూ.. సీఎం రేవంత్ తాజాగా అధికారులను మౌఖికంగా ఆదేశించారు. రోడ్డుపక్కన వ్యాపారాలు చేసుకునేవారి విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించాలని.. వారు అక్కడ చేసుకోకపోతే.. ఇంకెక్కడ వ్యాపారాలు చేసుకుంటారని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.
దీంతో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందంటూ.. సీజ్ చేసిన కుమారి బండిని స్వల్ప ఫైన్‌తో తిరిగి అప్పగించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. టూమచ్ పాపులారిటీ సంపాయించుకున్న కుమారి.. స్థానికంగానే కాకుండా.. ఇతర ప్రాంతాల వారు కూడా.. పనిగట్టుకుని వచ్చి.. ఆమె చేత్తో వడ్డించే మాంసాహారాన్ని ఇష్టంగా తీసుకుంటారు. దీంతో ఆమెకు డిమాండ్ రోజు రోజుకు పెరిగి.. జనాలు కిటకిట లాడే పరిస్థితికి వచ్చింది.
ఈ క్రమంలో యూట్యూబర్లు కూడా.. ఆమె వ్యాపారాన్ని హైలెట్ చేశారు. టేస్టు, ధరలు, కుమారి మాట తీరు.. ఇలా అనేక విషయాలపై ప్రత్యేకంగా రీల్స్ చేసి.. యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగిపోయి.. ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ కష్టా లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో కుమారిహోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ వ్యవహారం కూడా అదే రేంజ్‌లో పాపులర్ అయింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంటీ జోలికెందుకయ్యా వెళ్తారు.. అని మందలించినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి.
This post was last modified on January 31, 2024 2:34 pm
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…